ఏర్పేడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఏర్పేడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 20 మంది మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే సహాయక చర్యలలో పాల్గొనాలని ఆదేశించారు.ఏర్పేడు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు తదితరులు కూడా ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Back to Top