రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు | Two injured in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

Jan 21 2016 6:42 PM | Updated on Aug 30 2018 3:58 PM

వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం ముందు వెళ్తున్న టాటా ఏస్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

కంచికచర్ల (కృష్ణా జిల్లా) : వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం ముందు వెళ్తున్న టాటా ఏస్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.

విజయవాడ నుంచి కంచికచర్ల వైపు బైక్ పై వెళ్లున్న ఇద్దరు యువకులు పరిటాల గ్రామ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement