జీఓ జారీ చేసిన నిమిషాల్లోనే రద్దు చేస్తూ మరో జీఓ! | Sakshi
Sakshi News home page

జీఓ జారీ చేసిన నిమిషాల్లోనే రద్దు చేస్తూ మరో జీఓ!

Published Sat, Nov 22 2014 8:58 PM

జీఓ జారీ చేసిన నిమిషాల్లోనే రద్దు చేస్తూ మరో జీఓ! - Sakshi

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంలో బదిలీలపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇటీవల విశాఖ ఆర్డీఓ బదిలీ అంశం వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో వివాదం నెలకొంది. డీఎం అండ్ హెచ్ఓ నియామకాల్లో ఒత్తిళ్లు వస్తున్నాయి. జీఓ వచ్చిన కొన్ని నిమిషాల్లోనే దానిని రద్దు చేస్తూ మరో జీఓ జారీ చేశారు. విజయనగరం డీఎం అండ్ హెచ్ఓగా జె.సరోజినిని తొలుత నియమించారు. విశాఖపట్నంకు యు.స్వరాజ్య లక్ష్మిని నియమించారు. వీరితోపాటు 13 మంది డీఎం అండ్ హెచ్ఓలను బదిలీ చేశారు. జీఓ వచ్చిన కొన్ని నిమిషాలకే రాజకీయాలు మొదలయ్యాయి.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేషీలో చాలా వ్యవహారాలు నడిచాయి. ఇద్దరు విశాఖ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, పీలా గోవింద్లు సరోజినిని విశాఖలో నియమించాలని పేషీలో హడావిడి చేశారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు సిఫారసు చేసినా ఎలా బదిలీ చేస్తారని వారు ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుపై ఒత్తిళ్లు పెరిగిపోయాయి.

సరోజిని ఓ సీనియర్ మంత్రి బంధువు. దాంతో ఒత్తిళ్లు అధికమయ్యాయి.జీఓలో మార్పులుచేర్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సరోజినిని విశాఖ డీఎం అండ్ హెచ్ఓగా నియమించారు.

ఇదిలా ఉండగా, ఆయుష్ విభాగం బదిలీలపై రచ్చ జరుగుతోంది. ఆఖరి నిమిషంలో 150 మంది బదిలీలు నిలిచిపోయాయి.
**

Advertisement
Advertisement