గుంతకల్ డివిజన్‌లో రైళ్లలో విస్తృత తనిఖీలు | trains large checks in Guntakal division | Sakshi
Sakshi News home page

గుంతకల్ డివిజన్‌లో రైళ్లలో విస్తృత తనిఖీలు

Feb 5 2015 10:15 PM | Updated on Sep 2 2017 8:50 PM

అనంతపురం జిల్లాలోని గుంతకల్ డివిజన్‌లో పలు రైళ్లలో అధికారులు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్ డివిజన్‌లో పలు రైళ్లలో అధికారులు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంతకల్-డోన్ సెక్షన్‌లో రెండు పాసింజర్ రైళ్లు.. గుంతకల్-బళ్లారి సెక్షన్‌లో రెండు పాసింజర్ రైళ్లలో సోదాలు జరిగాయి. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి అధికారులు భారీగా జరిమానాలు వసూలు చేశారు. రైల్వే ఆదాయం పెంచేందుకే ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement