పూసలోళ్లను ఎస్టీల్లో చేర్చండి | Sakshi
Sakshi News home page

పూసలోళ్లను ఎస్టీల్లో చేర్చండి

Published Mon, Dec 18 2017 7:19 AM

People sharing there sorrows to ys jagan - Sakshi

పూసల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకెళ్లాంటూ విపక్ష నేత వైఎస్‌ జగన్‌ను ఆంధ్రప్రదేశ్‌ పూసల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. గతంలో బీసీ(డీ)లో ఉన్న తమను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బీసీ(ఏ)కు మార్చారని, అప్పట్లోనే తమను ఎస్టీల్లో చేర్చాలని విన్నవించామంటూ గుర్తుచేశారు. జగన్‌ను కలిసిన వారిలో గోవిందు గంగులప్ప, బోసెటి వెంకటేశు, రమణ, రామ్మోహన్, రమణ, పెద్ద కుళ్లాయప్ప ఉన్నారు.

Advertisement
Advertisement