తెగేదాకా లాగొద్దు: పవన్ కల్యాణ్ | pawan kalyan twitter comments | Sakshi
Sakshi News home page

తెగేదాకా లాగొద్దు: పవన్ కల్యాణ్

Jun 27 2015 7:15 PM | Updated on Mar 22 2019 5:33 PM

తెగేదాకా లాగొద్దు: పవన్ కల్యాణ్ - Sakshi

తెగేదాకా లాగొద్దు: పవన్ కల్యాణ్

ప్రశించడానికే పుట్టిన పార్టీ నాయకుడు ఎట్టకేలకు ఒక ట్వీట్ వదిలారు. అదీ దొరికీ దొరకుండా.. అడిగీ అడగకుండా.. ప్రశ్నించి ప్రశ్నించకుండా!

ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ నాయకుడు ఎట్టకేలకు ఒక ట్వీట్ వదిలారు. అదీ దొరికీ దొరకుండా.. అడిగీ అడగకుండా.. ప్రశ్నించి ప్రశ్నించకుండా! 'ఓటుకు కోట్లు' వ్యవహారం బయటపడిన నాలుగు వారాల తర్వాత, ఈ ఉదంతం ముదిరి పాకాన పడిన తర్వాత ప్రశ్నించే నాయకుడు ఎక్కడా అంటూ పలు వర్గాలు గొంతు చించుకున్న తర్వాత ట్విటర్ లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఇన్ని రోజుల మౌనముద్ర ఎవరికీ తెలియదు. అపుడెప్పుడో ఏపీ రాజధాని ప్రాంతంలో ఒకరోజు హడావుడి తర్వాత వినిపించకుండా పోయిన ప్రశ్నించే నాయకుడు ఇప్పుడు కూడా ప్రశ్నించిందేమీ లేదు. రెండు రాష్ట్రాల ప్రజానీకానికి, రాజకీయ నాయకులకు ఉపదేశం చేశారు.

'రాజకీయాలంటే ఎత్తుకు పై ఎత్తులేనా?'  అని ప్రశ్నించి ప్రశ్నించకుండా ఒక మాట వదిలారు. అక్కడితో ఆగారా... లేదు నెల్సన్ మండేలాను గుర్తుకు తెచ్చుకోమన్నారు. ప్రజల మంచి కోసం, అంతర్యుద్థం తలెత్తకుండా ఉండేందుకు నెల్సన్ సామరస్యపూర్వక ధోరణి అవలంభించారు. అదీ ఆ మహానీయుడి గొప్పతనం. మన రాజకీయ నాయకులు కూడా ఆ మార్గం అవలంభిస్తారని సలహాతో కూడిన ప్రవచనం కూడా ఒకటి చేశారు. తెగేదాకా లాగొద్దు అని కూడా చెప్పారు. మీరు ఇదే ధోరణితో కొనసాగితే ప్రజలు ఇబ్బందులు పడతారనే  ఆందోళన కూడా వెలిబుచ్చారు. ప్రశ్నించే నాయకుడు ఏమని ప్రశ్నించారో ఆయన మాటల్లోనే చదవండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement