సింగవరంలో వృద్ధుడు సజీవదహనం | oldman died due to fire accident in eastgodavari distirict | Sakshi
Sakshi News home page

సింగవరంలో వృద్ధుడు సజీవదహనం

Sep 11 2015 9:40 AM | Updated on Jul 6 2019 12:36 PM

తూర్పుగోదావరి జిల్లా వైరామవరం మండలం సింగవరంలో ప్రమాదవశాత్తూ పాపారావు(80) అనే వృద్ధుడు సజీవదహనమయ్యాడు.

వైరామవరం: తూర్పుగోదావరి జిల్లా వైరామవరం మండలం సింగవరంలో ప్రమాదవశాత్తూ పాపారావు(80) అనే వృద్ధుడు సజీవదహనమయ్యాడు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వృద్ధ దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా దీపం అంటుకుని ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పాపారావు సజీవదహనం అవ్వగా, వృద్ధుడి భార్య లక్ష్మమ్మ(70) అదృష్టవశాత్తూ బయటపడింది. లక్ష్మమ్మ కేకలు వేసినా సరైన సమయంలో ఇరుగుపొరుగు వారు రావడంలో ఆలస్యం కావడంతో వృద్ధుని కాపాడలేకపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement