ఏలూరులో ‘కృష్ణగాడు’ | krishna gadi veera prema gadha Chitra unit Triumph trip | Sakshi
Sakshi News home page

ఏలూరులో ‘కృష్ణగాడు’

Feb 18 2016 12:02 AM | Updated on Sep 3 2017 5:50 PM

ఏలూరులో ‘కృష్ణగాడు’

ఏలూరులో ‘కృష్ణగాడు’

నాని, మెహరీన్ హీరోహీరోయిన్లగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్రలో

సందడి చేసిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ యూనిట్

ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :నాని, మెహరీన్ హీరోహీరోయిన్లగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్రలో భాగంగా బుధవారం ఏలూరు చేరుకుంది. స్థానిక బాలాజీ థియేటర్ కాంప్లెక్స్‌లో ఉదయం ఆట ప్రేక్షకులతో తమ అనుభూతులను పంచుకుంది. నాని, మోహరీన్ చిత్రంలోని కొన్ని డైలాగులు చెప్పి ఉల్లాసపరిచారు. అనంతరం విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ మంచి ప్రయత్నాలే తెలుగు సినిమా విజయానికి ఫార్ములా అన్నారు. తన ప్రతి చిత్రాన్ని పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని, ఏలూరు వస్తే కొత్త ఉత్సాహం వస్తుందన్నారు. విజయోత్సవ యాత్ర లో భాగంగా విశాఖ, కాకినాడ, రాజ మండ్రిలో పర్యటించామని, అన్నిచోట్లా మంచి స్పందన వస్తోందన్నారు. మోహనకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. కృష్ణగాడి విజయంతో మరిన్ని మంచి చిత్రాలకు దర్శకత్వం వహించే ఉత్తేజాన్నిచ్చిందని దర్శకుడు హను రాఘవపూడి అన్నారు. చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నానని త్వరలో కొత్త ప్రాజెక్టు చేపట్టనున్నారన్నారు. హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ తన మొదటి చిత్రానికే ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్నారు. నిర్మాతలు గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, బాల నటులు మోక్ష, ప్రతమ్, సహాయ నటుడు శతృవు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement