కిరోసిన్ సరఫరాలో అక్రమాలను సహించం | Irregular supply of kerosene sahincam | Sakshi
Sakshi News home page

కిరోసిన్ సరఫరాలో అక్రమాలను సహించం

Sep 28 2014 3:11 AM | Updated on Sep 2 2017 2:01 PM

కిరోసిన్ సరఫరాలో అక్రమాలను సహించం

కిరోసిన్ సరఫరాలో అక్రమాలను సహించం

నెల్లూరు(పొగతోట): కిరోసిన్ సరఫరాలో హోల్‌సేల్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్‌ఓ శాంతకుమారి హెచ్చరించారు.

నెల్లూరు(పొగతోట): కిరోసిన్ సరఫరాలో హోల్‌సేల్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్‌ఓ శాంతకుమారి హెచ్చరించారు. శనివారం తన చాంబర్‌లో కిరోసిన్ హోల్‌సేల్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. హోల్‌సేల్ డీలర్లు సకాలంలో చౌక దుకాణాలకు కేటాయించిన ప్రకారం కిరోసిన్ సరఫరా చేయాలన్నారు. కిరోసిన్ సీ-రిటన్స్ తప్పకండా అందజేయాలని చెప్పారు. ప్రతి నెలా 20 నుంచి 26వ తేదీ లోపు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు కిరోసిన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కిరోసిన్ పూర్తి స్థాయిలో పంపిణీ జరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఫిర్యాదులపై ఆయా మండలాల సీఎస్‌డీటీలు పరిశీలించి వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఎస్‌ఓ వెంకటరాముడు, కిరోసిన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు జి.రవి కుమార్, దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.



 

Advertisement

పోల్

Advertisement