హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం | Hindu Dharma let us save | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం

Oct 2 2014 2:46 AM | Updated on Sep 2 2017 2:14 PM

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం

ఆళ్లగడ్డ టౌన్: హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందామని విశ్వహిందు పరిషత్ ప్రముక్ న్యాయవాది నీలకంఠం పిలుపునిచ్చారు.

ఆళ్లగడ్డ టౌన్:  హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందామని  విశ్వహిందు పరిషత్ ప్రముక్ న్యాయవాది నీలకంఠం పిలుపునిచ్చారు.  ఆ సంఘం ఆధ్వర్యంలో  పట్టణంలో  వారం రోజులుగా నిర్వహిస్తున్న ప్రాథమిక శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా స్వయం సేవకులు తదితరులు స్థానిక భారతీ విద్యామందిర్ నుంచి పాత బస్టాండ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఖుబ్దా వీధి, సంత మార్కెట్ మీదుగా పుర వీధులో  మార్చ్ పాస్ట్  నిర్వహించారు. అనంతరం స్థానిక భారతీ విద్యా మందిర్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ  విశ్వ హిందూ పరిషత్‌ను గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు.  మత మార్పిడిలను అరికట్టాలన్నారు.  కార్యక్రమంలో నాయకులు సుబ్బలక్ష్మయ్య, పద్మనాభుడు, టీఎంసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.



 

Advertisement
Advertisement