'పవన్.. నువ్వు పెయిడ్ ఆర్టిస్టువా ?' | gowtham reddy fires on pawan kalyan | Sakshi
Sakshi News home page

'పవన్.. నువ్వు పెయిడ్ ఆర్టిస్టువా ?'

Jul 7 2015 6:50 PM | Updated on Mar 22 2019 5:33 PM

'పవన్.. నువ్వు పెయిడ్ ఆర్టిస్టువా ?' - Sakshi

'పవన్.. నువ్వు పెయిడ్ ఆర్టిస్టువా ?'

'పవన్ కల్యాణ్.. నువ్వు సినీ ఆర్టిస్టా లేక పెయిడ్ ఆర్టిస్టువా..' అని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి ప్రశ్నించారు.

సత్యనారాయణపురం (విజయవాడ): 'పవన్ కల్యాణ్.. నువ్వు సినీ ఆర్టిస్టా లేక పెయిడ్ ఆర్టిస్టువా..' అని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో 35 రోజుల తర్వాత స్పందించిన పవన్.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివారని విమర్శించారు. దీనికి నిర్మాత, దర్శకుడు, సంగీతం, మాటలు ఎవరో అర్థమవుతోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు స్టీఫెన్‌సన్‌కు ఫోన్ చేయడం నేరం కాదా ? ఆ ఫోన్ సంభాషణలని స్టీఫెన్‌సన్ రికార్డు చేయడం నేరమా ? అని నిలదీశారు. గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి ఓటుకు కోట్లు వ్యవహారంపై ఏమీ చెప్పక పోవడం సిగ్గుచేటన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదన్న పవన్ మాట దివాలాకోరు వాదనగా గౌతమ్‌రెడ్డి అభివర్ణించారు.

Advertisement
 
Advertisement
Advertisement