ఏలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత | Former MLA Badeti Bujji Passes Away | Sakshi
Sakshi News home page

ఏలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Dec 26 2019 7:18 AM | Updated on Dec 26 2019 11:05 AM

Former MLA Badeti Bujji Passes Away - Sakshi

సాక్షి, ఏలూరు :  టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. కాగా, బుజ్జి 2014లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 

నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం..
మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి భౌతికకాయానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నివాళులర్పించారు.  బుజ్జి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, పలువురు ప్రముఖులు కూడా బుజ్జి భౌతికకాయానికి నివాళులర్పించినవారిలో ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement