అప్పుల బాధ తాళలేక | farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక

Oct 21 2015 2:16 PM | Updated on Oct 1 2018 2:36 PM

మరో మూడు రోజుల్లో కూతురు పెళ్ళి ఉండగా.. ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మరో మూడు రోజుల్లో కూతురు పెళ్ళి ఉండగా.. ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా మహానంది మండలం గాదెల పల్లి గ్రామానికి చెందిన రైతు మహానంది(40)కి నలుగురు కుమార్తెలు. పెద్ద కూమార్తె వివాహం ఈ నెల 24న జరగాల్సి ఉంది. కాగా.. బుధవారం తెల్లవారుజామున మహానంది ఇంటివద్ద పురుగుల మందు తాగి ఆహ్మతహ్యకు పాల్పడ్డాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో.. కుమార్తె పెళ్లి ఖర్చు రైతును కుంగదీసింది. ఇదే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని బంధువులు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement