వైఎస్సార్‌ కడప: ఓటరు లిస్ట్‌లో పేరుందా..? మీరు చెక్‌ చేసుకోండి.. | Election Commission To Launch Awareness Campaign To Increase Voter Participation | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ కడప: ఓటరు లిస్ట్‌లో పేరుందా..? మీరు చెక్‌ చేసుకోండి..

Mar 10 2019 9:14 AM | Updated on Mar 10 2019 8:01 PM

Election Commission To Launch Awareness Campaign To Increase Voter Participation - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప :  నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.

  • 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 
  • www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name   పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 
  • కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి  రామునాయక్ (స్టెప్‌ సీఈఓ) సెల్‌ నంబర్‌: 98499 09064 
  • జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. 
  • మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.  
  • సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. 

    ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement