ఆఫీస్ లోనే ఉరేసుకున్న డిప్యూటీ డైరెక్టర్ | deputy director eswaraiah commits suicide | Sakshi
Sakshi News home page

ఆఫీస్ లోనే ఉరేసుకున్న డిప్యూటీ డైరెక్టర్

Feb 2 2015 11:18 AM | Updated on Nov 6 2018 7:56 PM

సాక్షర భారత కార్యలయం డిప్యూటీ డైరెక్టర్ ఈశ్వరయ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనంతపురం: సాక్షర భారత కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఈశ్వరయ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్యాలయంలోనే ఈశ్వరయ్య ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. విధులకు హాజరవుదామని వచ్చిన ఉద్యోగాలకు ఈశ్వరయ్య ఉరేసుకుని కన్పించడంతో వారంతా షాక్ కు గురైయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 

అసలు కార్యాలయంలోనే ఈశ్వరయ్య ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషాద వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి బయల్దేరారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement