రేపు సీఎం రాక | CM arrival of Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు సీఎం రాక

Apr 2 2015 1:50 AM | Updated on Jul 28 2018 3:23 PM

రేపు సీఎం రాక - Sakshi

రేపు సీఎం రాక

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఒక ....

చిత్తూరు (సెంట్రల్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రాత్రి 10 గంటలకు ఆయన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట నుంచి బయలుదేరి అర్ధరాత్రి 12.30 గంటలకు తిరుపతి ఫార్చూన్‌గ్రాండ్ రిడ్జ్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 7.15 గంటలకు బయలుదేరి 8.45 గంటలకు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. 10.30 గంటలకు అక్కడ బయలుదేరి 11.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని పేర్కొన్నారు.

అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీసిటీకి చేరుకుని 1.10 గంటలకు పెప్సికో యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం అక్కడ వ్యాపారవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. విలేకరుల సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళతారని కలెక్టర్ తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement