హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీక్ష దేనికోసం చేస్తున్నారో చెప్పాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. గడ్డితినైనా అధికారంలోకి రావడం బాబు సిద్ధాంతం అన్నారు. ఆనాడు ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖలో తెంగాణకు అనుకూలం అని చెప్పింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.
రెండు రూపాయల బియ్యంను 5 రూపాయలు చేసింది చంద్రబాబు. ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెబుతాబుతున్నారు. రాష్ట్రంలో బెల్టు షాపులను పరిచయం చేసింది చంద్రబాబు. కిరణ్ ప్రభుత్వపై అవిశ్వాసం పెడితే మద్దతు పలికింది చంద్రబాబు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. నయవంచనకు మారు పేరు చంద్రబాబు, అవకాశవాదానికి మారుపేరు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. రోజుకో మాట మాట్లాడటంలో దిట్ట అన్నారు. చంద్రబాబు మాటలు మార్చడాన్ని చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయన్నారు.
వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబు తరువాతే ఎవరైనా అని విమర్శించారు. గులాబీ కండువా కప్పుకొని ఆనాడు చంద్రబాబు తెలంగాణకు మద్దతు పలకలేదా? అని అడిగారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒకప్పుడు కంప్యూటర్ వద్ద చంద్రబాబు కూర్చుకున్న ఫొటో ఉండేదని, ఇప్పుడు నాగలి పట్టిన చంద్రబాబు ఫొటో ఉందని తెలిపారు. నాగలిపట్టిన ఫొటో పెట్టినంత మాత్రాన జనం నమ్ముతారా? అని ప్రశ్నించారు.
గతంలో బీజేపీ కారణంగానే ఓడామని ఆరోపణలు చేసిన చంద్రబాబు, ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఢిల్లీలో వెంపర్లాడుతున్నాడని ఆరోపించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వ అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇటీవల మోడీతో ఒకే వేదికను పంచుకొని ఆయనను పొగడ్తలతో ముంచెత్తడాని హరీష్ రావు తప్పుపట్టారు.
చంద్రబాబు దీక్ష దేనికోసమో చెప్పాలి:హరీష్
Published Sun, Oct 6 2013 4:45 PM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు
ఈ తారల ‘ముందస్తు’ జాతకాలివే..
అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం
చిల్లర రాజకీయాల కోసం కొందరు ఉద్యమాన్ని వాడుకున్నారు: కేసీఆర్
కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు
సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఘన విజయం
అది నమ్మక ద్రోహమే.. ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల కంప్లైంట్
Beauty Tips: పాదాలు అందంగా కనిపించాలా? అయితే ఈ టూల్‌ని..
ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్
గుంటూరులో అంగరంగ వైభవంగా నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు
తప్పక చదవండి
- T20 WC: సిక్సర్ల సునామీ.. క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
- వావ్ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు!
- ఒక్క రాత్రిలో భయపెట్టే ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్.. ఎలా ఉందంటే?
- ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
- ఐటీలో మేటి..
- South Africa Elections 2024: దక్షిణాఫ్రికాలో వచ్చేది సంకీర్ణమే!
- టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
- ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జల
- Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement