ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు | Celebrated Buddha Jayanti celebrations in amaravathi | Sakshi
Sakshi News home page

ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు

May 4 2015 11:58 PM | Updated on May 25 2018 7:04 PM

ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు - Sakshi

ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది.

అమరావతి (గుంటూరు): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ధ్యాన బుద్ధ విగ్రహాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ధ్యానబుద్ధ రూపశిల్పి రేగుళ్ల మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధికి బుద్ధ జయంతి వేడుకలు నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు.


ఆంధ్రప్రదేశ్‌కు లోటు బడ్జెట్ ఉన్నా అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, మాజీ మంత్రి పుష్పరాజ్, ఎమ్మెల్సీ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. తొలుత బౌద్ధ భిక్షువుల నేతృత్వంలో ప్రార్థనలు జరిపి సభను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement