ఆ ప్రొఫెసర్లను తిరిగి విధుల్లోకి తీసుకోండి: ఏపీసీసీ | APCC demands to call back suspended professors into their duties | Sakshi
Sakshi News home page

ఆ ప్రొఫెసర్లను తిరిగి విధుల్లోకి తీసుకోండి: ఏపీసీసీ

Jun 15 2016 4:02 PM | Updated on Aug 18 2018 9:03 PM

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ) ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం అన్యాయం, అప్రజాస్వామికమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) వ్యాఖ్యనించింది.

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ) ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం అన్యాయం, అప్రజాస్వామికమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) వ్యాఖ్యనించింది. ప్రొఫెసర్లు కేవై రత్నం, సదాగత్ సేన్ గుప్తాలపై యూనివర్సిటీ సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఖండించింది. వీరిపై వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం బీజేపీ నియంతృత్వ ధోరణికి మరో ఉదాహరణ అని ఏపీసీసీ అధికార ప్రతినిధి జంగా గౌతమ్ అన్నారు. ఓ వైపు అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలంటూనే మరో వైపు దళితులను అణివేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement