'తుఫాను'కు రక్షణ కల్పించండి: హైకోర్టు | andhra pradesh high court order provide security to zanjeer, toofan theatres | Sakshi
Sakshi News home page

'తుఫాను'కు రక్షణ కల్పించండి: హైకోర్టు

Sep 5 2013 12:10 PM | Updated on Sep 1 2017 10:28 PM

'తుఫాను'కు రక్షణ కల్పించండి: హైకోర్టు

'తుఫాను'కు రక్షణ కల్పించండి: హైకోర్టు

తుఫాను, జంజీర్ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద రక్షణ కల్పించాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ, హోం శాఖలను హైకోర్టు ఆదేశించింది.

తుఫాను, జంజీర్ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద రక్షణ కల్పించాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ, హోం శాఖలను హైకోర్టు ఆదేశించింది. తమ చిత్రాన్ని అడ్డుకోకుండా చూడాలని జంజీర్ సినిమా నిర్మాతలు నిన్న హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 6న విడుదల కానున్న జంజీర్, తుఫాన్ సినిమాల ప్రదర్శన కేంద్రాలకు తగిన భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది.

‘విభజన’ ఆందోళన వల్ల ఈ సినిమాల ప్రదర్శనకు ఆందోళనకారులు ఇబ్బందులు సృష్టిస్తే, తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌లో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శిబాశిష్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చారు. చట్ట వ్యతిరేక శక్తులు ఈ సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement