డెంగీతో చిన్నారి మృతి | 6 year old child died due to dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో చిన్నారి మృతి

Aug 28 2015 9:14 AM | Updated on May 28 2018 1:08 PM

వైఎస్ఆర్ జిల్లా లో డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది.

చెన్నూరు: వైఎస్ఆర్ జిల్లా లో డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసపల్లి గ్రామంలో వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన మాదినేని గిరిప్రసాద్, ఉమాదేవి దంపతులకు కావ్యశ్రీ(6) కుమార్తె. కాగా, గత మూడు రోజులుగా జ్వరం రావడంతో కడప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. తిరుపతిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కావ్యశ్రీ మృతి చెందింది. డెంగీ తో బాలిక మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

Advertisement
 
Advertisement
Advertisement