ఉద్యోగాల పేరిట రూ. 1.5 కోట్లు టోకరా | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట రూ. 1.5 కోట్లు టోకరా

Published Wed, Oct 22 2014 4:27 PM

100 employees cheated, 1.5 crore rupees fraud

తిరుపతి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి చివరకు జైలుకెళ్లాడు.  వివరాలిలా ఉన్నాయి.

తిరుపతిలో బాలకృష్ణ అనే వ్యక్తి స్విమ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు ఎర వేశాడు. వంద మంది నుంచి 1.5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. వారికి ఉద్యోగాలు ఇప్పించినట్టు నమ్మబలికి నియామక పత్రాలు, ఐడెంటిటీ కార్డులు సైతం అందజేశాడు. నిరుద్యోగులు నిజమేననుకుని మూడు నెలలుగా స్విమ్స్ చుట్టూ తిరుగుతున్నారు. తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement