-
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్‌పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. -
న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశించిన పుతిన్
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న తరుణంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు సమీపంలో రష్యన్ మిలటరీ, నేవి ఆధ్వర్యంలో అణ్వాయుధాల డ్రిల్స్ నిర్వహించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు ఆ దేశ రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అణుయుద్ధానికి సంబంధించి పుతిన్ పలుసార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.న్యూక్లియర్ డ్రిల్స్ చేస్తున్న సమయంలో నాన్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగించటంపై శిక్షణ తీసుకోనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. నాన్ స్ట్రాటిజిక్ న్యూక్లియర్ ఆయుధాలను టెక్నికల్ వెపన్స్ అంటారు. యుద్ధ క్షేత్రాల్లో ఉపయోగించే మిసైల్స్ గుండా వీటిని ప్రయోగిస్తారు.కొన్ని పశ్చాత్య దేశాల నుంచి తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో న్యూక్లియర్ డ్రిల్స్ చేపడతామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అక్రమిత ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక బలగాలతో పాటు.. వైమానిక, నౌకా దళాలు న్యూక్లియర్ డ్రిల్స్ పాల్గొంటాయని పేర్కొంది. అమెరికాతో గతంలో చేసుకున్న ‘న్యూ స్టార్ట్ ఒప్పందం’నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని గతేడాది రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. -
రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 19 మంది మృతి
ఇజ్రాయెల్- హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ, మానవతా సాయం కోసం ఒప్పందంపై చర్చల ప్రయత్నాలు జరుతున్న సమయంలో ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దులో హమాస్ బలగాలు రాకెట్ల దాడితో తెగపడ్డాయి. హమాస్ బలగాలు చేసిన రాకెట్ల దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు మరణించగా, పలువురు గాయడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. రఫా నుంచి దాదాపు పది రాకెట్లు కెరెమ్ షాలోమ్ సరిహద్దు ప్రయోగించబడ్డాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. మరోవైపు హమాస్ రాకెట్ దాడికి ప్రతికారంగా ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం చేసిన దాడిలో 19 మంది మృతి చెందినట్లు పాలస్తీనా అధికారులు పేర్కొన్నారు. హమాస్ రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దును మూసివేసినట్లు ప్రకటించింది. గాజాకు మానవతా సాయం, ఆహారం, వైద్య సామాగ్రి అందించడానికి వినియోగించే పలు సరిహద్దుల్లో కెరెమ్ షాలోమ్ ఒకటి. ఇక..కాల్పుల విరమణ, మానవతా సాయానికి సంబంధించి ఆదివారం హమాస్ మిలిటెంట్ల డిమాండ్‌ను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఖతర్, ఈజిప్ట్, అమెరికా దేశాలు కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం గాజాలోని కీలకమైన రఫా నగరంపై తమ దాడి కొనసాగిస్తామని తేల్చిచెబుతోంది. -
టెక్సాస్‌లో భారీ వర్షం.. ఎటుచూసినా వరద నీరే..
టెక్సాస్: అమెరికాలోకి టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా టెక్సాస్‌ను వరదలు ముంచెత్తాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.కాగా, భారీ వర్షాల కారణంగా అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 600 మంది ప్రజలను సహాయ సిబ్బంది రక్షించారు. నాలుగు నెలల్లో కురువాల్సిన వానలు ఒక్కవారంలోనే పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయని అధికారులు వెల్లడించారు. ఇక, వర్షాల కారణంగా ఒక్క చిన్నారి మృతి చెందినట్టు సమాచారం. Houston neighborhoods in Texas were heavily flooded on Saturday following heavy rains. Local officials reported that 178 people and 122 pets (and apparently at least one armadillo, as footage shows) have been rescued so far by emergency teams pic.twitter.com/IEVDbvZARw— RT (@RT_com) May 5, 2024 వరదల కారణంగా వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. వరదలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Crews rescued more than 400 people from homes, rooftops, and roads engulfed in murky water in Houston, Texas, following days of heavy rains. pic.twitter.com/aliJjNcfp5— Breaking News (@TheNewsTrending) May 5, 2024 Torrential rains caused catastrophic floods in southeastern #Texas leading to closure of schools and several highways around #Houston4/7VC: playingsims3 & onairryan#Flood #TXwx #Louisiana #LAwx #Storm #Rain #Flooding #Flashflood #Weather #Viral #Climate pic.twitter.com/Vu1iN6j9xP— Earth42morrow (@Earth42morrow) May 5, 2024 -
240 కోట్ల కార్మికులు ఎండలకు విలవిల!
తరచూ చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ప్రతి సంవత్సరం సగటున 240 కోట్ల మంది కార్మికులపై పడుతోంది. దీనికి సంబంధించిన వివరాలను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తన నూతన నివేదికలో అందించింది. దీనిలోప్రపంచవ్యాప్తంగా కార్మికుల భద్రత, వారి ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాలను వివరించారు.ప్రపంచంలోని 71 శాతం మంది కార్మికులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ బారిన పడుతున్నారు. 2010లో ఇది 65.5 శాతంగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా కార్మికులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం 2.3 కోట్ల మంది కార్మికులు తీవ్రమైన వేడి కారణంగా పని సమయంలో అనారోగ్యానికి గురవుతున్నారు. 18,970 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.అత్యధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే కార్మికులు కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో 2.62 కోట్ల మంది కార్మికులు ఉండవచ్చని అంచనా. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ కార్మిక చట్టాలను పటిష్టం చేయాలని ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. తద్వారా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొంది. అత్యధిక వేడి, వాయు కాలుష్యం మొదలైనవాటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement