-
జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
పేదరికం అత్యంత బాధాక రమైనది. ప్రపంచంలో అత్యధి కులు పేదవారే. వారిని పేద రికం నుండి బయట పడేయ గలదీ, అభివృద్ధి వైపు నడప గలిగేదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే. దీనిని అర్థం చేసుకొన్నారు కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ప్రజల విశ్వసనీయతను చూరగొన్నారు. ఇప్పుడు మరోమారు ప్రజా సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని ఎన్నికల బరిలో దిగారు. పలు పబ్లిక్ మీటింగులూ, సుదీర్ఘ రాజకీయ యాత్రలతో విజయం వైపు నడుస్తున్నారు.ఇక ప్రతిపక్ష కూటమి నాయకుడు చంద్రబాబు మాత్రం అభద్రతా భావంతో ఎన్నికల్లో నానా తిప్పలు పడుతున్నారు. చెప్పుకోవడానికి ప్రజలకు తాను చేసింది ఏమీ లేదు కాబట్టి జగన్ ప్రభుత్వంపై దుష్ప్ర చారాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. జనసేన – బీజేపీ నాయకులూ, ఆ యా పార్టీల పరిస్థితీ కూడా ఇదే. అందుకే, టీడీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా మరలా ఓడిపోవడం తథ్యం. పెన్షనర్లలో 90 శాతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతున్న 40–60 ఏళ్ల వయస్సు స్త్రీలలో 90 శాతం, డ్వాక్రా మహిళల్లో 80 శాతం, మొత్తంగా స్త్రీలలో 90 శాతం వైఎస్సార్సీపీకే ఓటు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లింలు, రెడ్లు, బ్రాహ్మణులు, అత్యధిక మంది బీసీలు వైఎస్సార్సీపీకే ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కొంతమంది మధ్యతరగతి అర్బన్ ఓటర్లు మాత్రమే టీడీపీ కూటమికి ఓట్లు వేస్తారని అంటున్నారు. కాంగ్రెస్‌కు గతం కంటే అర శాతం మాత్రమే ఓట్లు పెరగవవచ్చు.అయోధ్యలో గుడి నిర్మాణం, కొన్ని జాతీయ రహదారులను నిర్మించడం తప్ప బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఏపీకి సంబంధించి... ఏపీకి స్పెషల్ స్టేటస్, రాయలసీమ – ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, పోల వరానికి ని«ధులు వంటి అనేక వాగ్దానాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదు. ఇదీ బీజేపీ క్రెడిబిలిటీ!జVýæన్ మాత్రం పేదల ముఖ్య అవసరాల్ని తీరుస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు. పేదల కొనుగోలు శక్తిని కోవిడ్ లాంటి క్లిష్ట సమయాల్లో కూడా పెంచగలిగారు. అందుకే 2019లో 12 శాతం ఉన్న పేదరికం 2024 నాటికి దాదాపు 4 శాతానికి తగ్గిపోయింది. జీఎస్టీ చెల్లింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారు జగన్. జగన్ ప్రభుత్వం పేదలకు డీబీటీ కింద రూ. 2,70,000 కోట్లను, నాన్–డీబీటీ కింద ఇండ్లు, స్థలాలు వంటి రూపాల్లో రూ. 1,00,000 కోట్లకు పైగా ఇచ్చారు. మొత్తంగా నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అంతేగాక పాలనా వ్యవస్థలో, సంక్షేమ సేవల్లో, అభివృద్ధిలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచేట్లు చేశారు వైఎస్ జగన్. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, ఆరోగ్య శ్రీకి రూ. 25 లక్షల వరకూ ప్రభుత్వ సాయాన్ని పెంచడం, వృద్ధాప్య పింఛన్‌ను రూ. 3 వేల వరకు పెంచడం, స్త్రీ సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం; రాజకీయాల్లోనూ, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లోనూ... మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం; వలంటీర్ వ్యవస్థ, రైతుభరోసా, ఉచిత పంటల భీమా, ఆక్వా రైతులకు తక్కువ ధరకు విద్యుత్, అమూల్ ద్వారా ఎక్కువ పాల ధర ఇవ్వడం, భూముల సర్వే, భూపట్టాల ధ్రువీకరణ, నాడు – నేడుతో పాఠశాలల రూపు మార్చడం, ఇంగ్లీష్ మీడియం విద్య, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా కానుక... ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మనసులను జగన్ దోచుకున్నారు.మరి చంద్రబాబు ఇలాంటి వేటినీ చేపట్టలేదు. ఇలాంటివి ఏ ఒక్కటీ చేశానని ఆయన చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ప్రతి ఎన్నికలప్పుడూ పలు పథకాల్ని ప్రకటించడం, ఎన్నికలు అయిపోయాక వాటి అమలు మరచిపోవడం చేసేవారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల విషయంలో మాట్లాడ కూడని మాటలు మాట్లాడేవారు. అందుకే ఆయన జనంతో సంబంధాల్ని మానసికంగా కోల్పోయారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయక పోవడం, పొదుపు సంఘాలకు రుణమాఫీ అమలు పరచక పోవడం, కొత్తగా జన్మించిన ఆడబిడ్డకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఇస్తానన్న డబ్బు ఇవ్వక పోవడం, ఇంటింటికీ ఒక ఉద్యోగం – ఉద్యోగం ఇవ్వలేకుంటే నెలకు రూ. 2 వేలు ఇస్తానని ఇవ్వక పోవడం; పేదలకు మూడు సెంట్ల నేల, ఇల్లు, బీసీలకు సబ్ ప్లాన్, స్త్రీ రక్షణ ఫోర్స్ ఏర్పాటు, పసుపు–కుంకుమ పథకం లాంటి వాటిని అమలు చేయకుండా జనాన్ని మోసగించారు. విద్యను, వైద్యాన్ని వ్యాపారీకరణ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు వైఫల్యాలు ఎన్నో!బాబు ఘోర వైఫల్యం చెందిన అనంతరం పరి పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ ఏపీలోని ప్రతి కుటుంబానికీ ఏదో ఒక రూపంలో మేలు చేశారు. అందుకే తాను ఏదైనా మేలు చేశానని నమ్మితేనే తనకు ఓటు వేయమని ఆయన ధైర్యంగా ప్రజలను అడుగు తున్నారు.ప్రొ‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి వ్యాసకర్త ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర శాఖవిశ్రాంత ఆచార్యులు ‘ 98495 84324 -
ఇలాగేనా మాట్లాడేది?
‘‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’’ అని ఒక లౌకికవాద దేశానికి ప్రధానమంత్రి తోటి పౌరుల గురించి మాట్లాడడం తగినదేనా? ‘వారు’ కూడా సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, గ్రహాంతరవాసులూనా? అలా మాట్లాడటాన్ని ఆయన్ని అభిమానించేవారు సమర్థిస్తున్నట్లు్ల అనిపిస్తోంది. లేకుంటే ఆయన అలా అనటాన్ని ఆపి ఉండేవారా? తనను సరిదిద్దుకునేవారా?ప్రధానమంత్రులు ఎల్లవేళలా సరైన, గౌరవ ప్రదమైన పనే చేస్తారన్న భావన ఉన్న యుగంలో నేను పెరిగాను. అంతేకాదు, ప్రధాని చెప్పారంటే ఇక అది సరైనది అయినట్లే! మాటల్లో పొల్లుపోవటం అత్యంత సహజం అయి నప్పటికీ, జవహర్లాల్ నెహ్రూకు కూడా అలా జరిగేదంటే నా తల్లి తండ్రులు అస్సలు నమ్మేవారు కారు. ఆ పాతకాలపు ప్రామాణికతకు ఆయనొక శ్రేష్ఠమైన నమూనాగా పరిగణన పొందారు. ‘యాభైలు’, ‘అరవైల’ నుంచి మనం చాలా దూరం ప్రయాణించి వచ్చాం. ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఊహించరానిదేమీ ఉండదు. ఏ ఉత్కృష్టులైన వారినో పక్కన పెడితే ప్రధానమంత్రులూ ఇక ఏమాత్రం భిన్నమైన వ్యక్తులుగా మిగిలి లేరు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి దశాబ్దంలో వారి పట్ల కనిపించిన సహజమైన గౌరవభావన, వారంటే ఉండే కొద్దో గొప్పో ఆరాధన పూర్తిగా కనుమరుగయ్యాయి. ‘సబ్ చోర్ హై’ (అందరూ దొంగలే) అన్నదే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న నమ్మకం అయింది.ఇప్పటికి కూడా, నా అత్యంత నిరాశావాద, చీకటిమయ మనః స్థితుల్లో సైతం– తన సొంత, తోటి పౌరులలో ఒక గణనీయమైన వర్గం మీద ఒక ప్రధాని దాడి చేస్తూ, వారిని పిశాచాలుగా చూపటం వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. అదేపనిగా అందుకోసం మార్గా లను కనుగొంటారని కూడా! ఆయనను అభిమానించేవారు తెలివిగా దీనిని... అదేపనిగా అని కాక, అనేకసార్లు అని అనవచ్చు. ఆయన అలా చేయటాన్ని వారు ఆనందిస్తున్నట్లు, సమర్థిస్తున్నట్లు, సహేతుక మేనని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే కచ్చితంగా ఆయన అలా చేయటాన్ని ఆపి ఉండేవారా? తనను తను సరిదిద్దుకునేవారా? బహుశా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసేవారా? కానీ అలా జరగక పోగా, అవి పునరుద్ఘాటనలు అవుతున్నాయి. బహిరంగంగా, శక్తిమంతంగా, స్థానాలను మార్చుకుంటూ కొనసాగుతున్నాయి. మొదట చెప్పినదానినే ఉన్నది ఉన్నట్లుగా మళ్లొకసారి చెబుతాను. నా ప్రతిస్పందన అర్థంచేసుకోదగినదా లేక అతిశయోక్తితో కూడినదా అని మీకై మీరు ఆలోచించండి. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలో వచ్చిన దానిని బట్టి హిందీలో ఆయన మాట్లాడిన మాటలు సరిగ్గా ఇవే: ‘‘పెహ్లే జబ్ ఉన్కీ సర్కార్ థీ, ఉన్హోనే కహా థా కీ దేశ్ కీ సంపతీ పర్ పెహ్లా అధికార్ ముసల్మానోం కా హై. ఇస్కా మత్లబ్, యే సంపతీ ఇకఠ్ఠీ కర్కే కిస్కో బాటేంగే? జిన్కే జ్యాదా బచ్చే హై, ఉన్కో బాటేంగే, ఘుస్పైఠియోన్ కో బాటేంగే. క్యా ఆప్కీ మెహనత్ కీ కమాయి కా పైసా ఘుస్పైఠియోన్ కో దియా జాయేగా? ఆప్కో మంజూర్ హై యే?’’ (‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’)మరి, ‘ఎక్కువమంది పిల్లలను’ కలిగివున్న ఆ వ్యక్తులు ఎవరు? ‘చొరబాటుదారులు’ అని పిలవబడుతున్న ఈ వ్యక్తులు ఎవరు? స్పష్టంగానే ఉంది కదా, మొదటి వాక్యాన్ని బట్టి ఇంకా స్పష్టంగా లేదా? ఇంకా ఏమైనా సందేహమా? అలాగే పైన పేర్కొన్న ‘ముసల్మా నులు’ ఎవరు? వారు భారతదేశ ముస్లింలు కారా? మన తోటి పౌరులు కారా? సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ కలిగి ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, బయటి వ్యక్తులు, గ్రహాంతరవాసులూనా?ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి? దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే నేను అమాయకుడిని అవుతానా? ఇంకా చెప్పాలంటే కదిలిపోవటానికి ? లేదా ఆ విధమైన ఆరోపణలను మీరు మన ప్రధా నులు ఎవరినుంచైనా విని ఉన్నారా?డోనాల్డ్ ట్రంప్ తరచూ ఇలా మాట్లాడ్డం నాకు తెలుసు. ఆయన అలా మాట్లాడినప్పుడు మనకు వికారం పుడుతుంది. 1960లలో బ్రిటన్‌లో ఇనాక్ పావెల్ ఇలాగే మాట్లాడితే అక్కడి ఆధిపత్య సమాజ సమూహం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. కానీ మన తరంలోని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్లు, సాధ్వీ రుతంభరలు ఇటువంటి వాక్చాతు ర్యాన్ని ఆస్వాదిస్తారనడంలో సందేహమే లేదు. అయితే అందుకు వారు తిరిగి పొందేది ధిక్కారాన్ని, ఎగతాళిని మాత్రమే! నా బోళాతనం బహుశా మీ దృష్టిలో తీవ్రంగా దెబ్బతిని ఉంటుందని నేను అంగీకరిస్తున్నప్పటికీ, ఇప్పటికైతే నన్ను ఆశ్చర్యపరిచే విషయం వేరొకటి ఉంది. అది మన మీడియా స్పందన. ఒకవేళ అలాంటిదేమైనా ఉండివుంటే, నాకైతే ఆందోళన కనబడలేదు, ఏహ్యభావం కనబడలేదన్నదైతే నిశ్చయం. బహుశా నేను చదవాల్సిన పత్రికల్ని చదవలేదేమో! చూడాల్సిన టీవీ చానెళ్లను చూడలేదేమో! కానీ నాకు అనిపించింది ఏమిటంటే, చెప్పినదాన్ని మౌనంగా అంగీ కరించారని! అంగీకరించకపోయినా, కనీసం దానిమీద వ్యాఖ్యానించ నైనా లేదు. విమర్శ అయితే అసలు చేయలేదు. అది ఖండనార్హమైనది కాదని నేను అనుకుంటే తప్ప నాకది దాదాపుగా నమ్మకశ్యంగా లేదు. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారా?క్షమించండి. నేను ఈరోజు చాలా ప్రశ్నలు సంధించి మీకు అతి కొద్ది సమాధానాలు మాత్రమే ఇచ్చాను. కానీ నా అభిప్రాయాలను మీపై రుద్దడం నాకు ఇష్టం లేదు. బదులుగా, మీరేం అనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కనుక మరొక చివరి ప్రశ్నకు నన్ను మన్నించండి: ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి అయిన వారు భిన్న మత విశ్వాసాన్ని కలిగిన తోటి పౌరుల గురించి ఇలా మాట్లాడడం తగినదేనా? మరింత కచ్చితంగా అడగాలంటే, నైతికంగా సరైనదేనా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు
ప్రపంచాన్ని మలుపుతిప్పిన ఘటనల్లో ఒకటి కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ జననం. జర్మనీ (ప్రష్యా)లో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అనంతరం పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఫ్రాన్స్ వెళ్ళారు. అక్కడే ఆయన జీవితకాల ఉద్యమ సిద్ధాంత మిత్రుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ను కలుసు కున్నారు. ఫ్రాన్స్ ఆయన్ని దేశం నుంచి బహిష్కరించడంతో ముందు బెల్జియం ఆ తర్వాత ఇంగ్లండ్ (లండన్) వెళ్లి మిగిలిన జీవితమంతా తన భార్యాబిడ్డలతో అక్కడే గడిపారు. మార్క్స్ తన జీవితకాల మిత్రుడు, సహచరుడు, సిద్ధాంతకర్త అయిన ఫ్రెడరిక్ ఏంగిల్స్‌తో కలిసి ‘కమ్యూ నిస్టు లీగు’ ఏర్పాటు చేసి 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ఏంగిల్స్‌తో కలిసి రాశారు. 1867లో ‘దాస్ క్యాపి టల్’ మొదటి వాల్యూమ్‌ను ప్రచురించారు.మానవ సమాజ సమూహ సంబంధాలు అన్నిటినీ కార్ల్ మార్క్స్ ‘ఫ్రెడరిక్ ఏంగిల్స్‌లు శాస్త్రీయంగా నిరూ పించారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి బానిస సమాజం, బానిస సమాజం నుండి ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం, పెట్టుబడిదారీ సమాజం నుండి సోషలిస్టు సమాజానికి మానవ సమాజం ఎలా పరిణామం చెందు తుందో... సోషలిస్టు సమాజం నుండి అంతిమంగా కమ్యూనిస్టు సమాజం వైపు వర్గహిత సమాజం వైపు ఎలా మానవ సమాజం ప్రయాణిస్తుందో శాస్త్రీయంగా మార్క్స్–ఏంగెల్స్‌లు నిరూపించారు, సిద్ధాంతీకరించారు. మానవ సమాజ పరిణామ క్రమంలో శ్రమ పాత్రనూ, శ్రమ ఔన్నత్యాన్నీ, సర్వసంపదలకు శ్రమే మూలం అన్న విషయాన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సిద్ధాంతీకరించిన తత్వవేత్తలు కారల్ మార్క్స్, ఏంగెల్స్‌లు. కార్మికుని అదనపు శ్రమే ‘పెట్టుబడి’ అనే విషయాన్ని బహుముఖ కోణాల నుంచి పరిశోధన చేసి ‘దాస్ క్యాపిటల్’ను ప్రపంచానికి అందించారు. గతి తర్కాన్ని, చారిత్రిక భౌతిక వాదాన్నీ, తలకిందులుగా ఉన్న హెగెల్ తత్వ శాస్త్రాన్నీ, అందులోని భావవాదాన్నీ సరిదిద్ది భౌతిక వాదం తన కాళ్ళ మీద తను నిలబడే టట్లుగా రూపొందించారు మార్క్స్. అభివృద్ధి నిరోధకమైన పాత వ్యవస్థ, అభివృద్ధి కరమైనటువంటి కొత్త వ్యవస్థను అనుమతించదు. అందుచే బల ప్రయోగం ద్వారా పాత అభివృద్ధి నిరోధక వ్యవస్థను నెట్టివేయాలనీ, కూలదోయాలనీ మార్క్స్ శాస్త్రీయంగా వివరించారు. మార్క్స్ తదనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద రూపం తీసుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత రూపమే సామ్రాజ్యవాదం అని లెనిన్ సిద్ధాంతీకరించారు. మార్క్సిజాన్ని రష్యా పరిస్థితులకు అన్వయించి కార్మిక వర్గ నాయకత్వాన, కర్షకవర్గం మైత్రితో లెనిన్ సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేశారు.– మన్నవ హరిప్రసాద్, సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పాలిట్ బ్యూరో సభ్యుడు(నేడు కారల్ మార్క్స్ జయంతి) -
దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి... రెండు పగ్గాలను ఒకే చేత్తో పట్టుకొని ప్రభుత్వాన్ని జనరంజకంగా నడపడం సాధారణ విషయం కాదు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడకను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తాను పాలన చేపట్టేనాటికి ఉన్న అస్తవ్యస్తమైన పాలనను గాడిలో పెట్టడమే గాక ప్రతి పథకాన్నీ ఒక విజన్‌తో రూపొందించడం జగన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. విద్య, వైద్యం, మౌలిక అవస్థా పనా సౌకర్యాల ఏర్పాటు, వ్యవసాయం, రైతు సంక్షేమం, బడుగు ప్రజలకు ఆవాసం... ఇలా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాటి వెనుక సంక్షేమం, అభివృద్ధి అనే రెండు కాన్సెప్టులూ పడుగు పేకల్లా కలిసే కనిపిస్తాయి.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మాత్రమే మనకు మిగిలితే, ఆ సంఖ్యను రెట్టింపు చేసి 26 జిల్లాల రాష్ట్రంగా మార్చడంలో జగన్ విజన్ ఏమిటో మనకు స్పష్టమ వుతుంది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే ప్రజల వద్దకు పాలన అనే విజన్ కార్యరూపంలోకి వస్తుంది గనుక జిల్లాలను విభజించి కలెక్టర్లు, ఎస్పీలు ప్రజలకు మరింత దగ్గరయ్యేట్లు చేశారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలముంగిటకు చేర్చారు. ఏ శ్రేయో రాజ్యంలోనైనా ఉద్యోగ కల్పన అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రజలకు ఎంత ఎక్కువగా ఉపాధి సమ కూరితే రాష్ట్రం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి అయిదేళ్లలో టీడీపీ ప్రభుత్వం 34 వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగా, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నాలుగు లక్షలకు పైనే ఉద్యోగాలు ఇచ్చింది. దీనికి అధికారికమైన లెక్కలు ఉన్నాయి. వాటిలో పర్మి నెంట్ ఉద్యోగాలే 2.31 లక్షలు ఉన్నాయంటే యువతకు ఉద్యో గాల కల్పన అంశానికి జగన్ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యమిచ్చిందో అర్థమవుతుంది. సరైన విజన్ అంటే ఇదేకదా!!ఉద్యోగాలు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడమేకాదు, ముందు ముందు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వాటికి ‘నైపుణ్య శిక్షణ’ ఇచ్చే కార్యక్రమాలు రూపొందించడం మరింత ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఇంజినీరింగ్, ఇతర విభాగాలలో విద్యార్థుల నైపుణ్యాలను మరింత మెరుగుపరచి వారిని వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి అర్హులుగా చేయడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, తిరుపతి, విశాఖ నగరాల్లో స్కిల్ డెవలప్మెంట్ వర్సి టీలు కూడా సంకల్పించారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలనుకొనేవారు ఏ విధంగా ఆలోచిస్తారో దీనిని బట్టి తెలుసు కోవచ్చు. సమాజంలోని వివిధ ప్రాధాన్య వర్గాలను బేరీజు వేసుకొని వారికి సరిపోయే ప్రణాళిక రూపొందించాలనేది సరైన విజన్ ఉన్న నేతకే సాధ్యమవుతుందని కూడా దీనిని బట్టి అర్థమవుతుంది.బడుగు ప్రజలు కూడా సమాజంలోని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనీ, అభివృద్ధి ఫలితాలు వారు కూడా అందు కోవాలనే లక్ష్యంతో జగన్ తమ మొదటి మేనిఫెస్టోలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారు. ‘నవరత్నాల’ను ప్రజలందరికీ అందించారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండో మేనిఫెస్టోలో... గతంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చారో తెలియజేసి, కొత్తగా మరికొన్ని పథకాలను ప్రతిపాదించారు. వాటిలో ముఖ్యంగా పేద పిల్లల చదువులకు ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యమిచ్చారో చూస్తే అర్థమవుతుంది. ఆడపిల్లలు బాగా చదువుకోవాలనీ, అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో ప్రాథమిక విద్య నుంచి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ‘అమ్మఒడి’, ‘విద్యా దీవెన’ ‘కళ్యాణమస్తు’, వంటి పథకాలుఅందుకే ప్రజల ఆదరణను అంతగా చూరగొన్నాయి. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు... ఈ మూడు అంశా లలో రాష్ట్రం సాధించిన ప్రగతినే ‘వాస్తవ అభివృద్ధి’గా చెబుతారు. అందుకే ఈ అంశాలకు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తుంది. మానవాభివృద్ధి పథ కాలు ఎంత ఎక్కువగా అమలైతే, సంక్షేమం అంత అభివృద్ధిగా మారుతుంది. ఇది తెలియని చాలా మంది సంక్షేమాన్ని అభివృద్ధిని వేర్వేరుగా చూస్తుంటారు. సంక్షేమం ముందుకు వెళ్తే అభివృద్ధిగా మారుతుందనే సిద్ధాంతాన్ని జగన్ నమ్మారు కనుకనే జగన్ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నారు. ప్రజలు ఆరోగ్యవంతులైతేనే ఎన్ని పనులైనా చేయగలుగుతారు. దానిని దృష్టిలో ఉంచుకొనే ఆరోగ్యరంగాభివృద్ధికి ప్రభుత్వంపలు కొత్త పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. వైఎస్సార్ పేరిట, జగన్ పేరిట పలు పథకాలు అమలవు తున్నాయి. కొత్తగా పలువైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి జరుగుతోంది.‘ఆరోగ్య శ్రీ’ ద్వారా రూ. 25 లక్షల విలువైన వైద్య చికిత్స అందించడానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో పేరుపొందింది. పేదలు చికిత్స కోసం ఎలాంటి అప్పులు చేయ రాదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడం, ఉచిత సేవలను ఎక్కువ ఆసు పత్రులకు విస్తరించడం, చివరకు కేన్సర్ చికిత్స కూడా ఉచితంగా అందించడం ఎంతో విశేషం. చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయంలో ‘ఆరోగ్య ఆసరా’తో ఆదుకుంటున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. వృద్ధాప్య పెన్షన్ పెంపు, ‘వైఎస్సార్ చేయూత’ వంటి పథకాల ద్వారా ఏ ఇంటిలోనూ ఎలాంటి సమస్యలు లేని వాతావరణం సృష్టించడంకంటే ‘శ్రేయోరాజ్య’నికి అసలైన అర్థం ఇంకేం ఉంటుంది?పాలనలో పిరమిడ్ నమూనాను పక్కన పెట్టి, చతురస్ర నమూనాను స్వీకరించడం జగన్ ప్రత్యేకత. ప్రభుత్వ పథకాలు అమలు అన్ని వైపులకు విస్తరించడానికి (అధికార యంత్రాంగం సమాజంలోని ఏ వర్గాన్ని వదలకుండా పథకాల ప్రయోజనాలు అందరికీ అందేట్లు చేయడం) ఈ చతురస్ర నమూనాను అనుస రించడం ఒక చక్కని ప్రయోగం. ఇలా ఒకటి రెండు కాదు, ‘జగన్’ను తెర మీద పరచే కార్యక్రమాలు, పథకాలు అనేకానేకం. అన్నీ ప్రజాదరణ పొందడం ఒక విశేషం. వాటన్నిటితో పాటు మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మరింత కొత్త ‘విజన్’తో ముందుకు వస్తానని జగన్ ప్రకటించడం ముదావహం.- వ్యాసకర్త ఏపీ మాజీ శాసనసభ్యులు ‘ 98481 28844- అడుసుమిల్లి జయప్రకాష్ -
కోడ్ ఉల్లంఘిస్తే గట్టి చర్యలుండాలి!
ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థుల నైతిక వర్తన నియమావళి (మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని తొలిసారి 1960లో రూపొందించారు. ఈ కోడ్‌ను ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు జారీ చేయడం 1979 నుంచి ఆనవాయితీగా మారింది. 1991లో పార్టీలన్నింటి అనుమతితో దీన్ని మరింత బలపరిచారు. కానీ రాజకీయ వాతావరణం పదును తేలినకొద్దీ, ఉల్లంఘనలు పెరిగాయి.కోడ్‌కు కట్టుబడి ఉండటం కంటే తప్పించుకునే మార్గాలను అన్వేషించేందుకే నేతలు ఇష్టపడుతుంటారు. కాబట్టి, వీలైనంత పారదర్శకంగా నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలుంటాయో స్పష్టం చేయాలి. అదే సమయంలో, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా కోడ్‌ను మార్చాలి. ప్రజాజీవితంలో గౌరవ మర్యాదలను కొనసాగించేందుకు ఇది చాలా ముఖ్యం.‘చాలాసార్లు ఎన్నికలు ఒక మనిషిలోని చెడ్డతనపు పార్శా్వన్ని బయటికి తెస్తాయి, అవి ప్రతిసారీ మంచి మనిషి విజయానికి దారితీయవనేది కూడా నిశ్చయం’ అన్నారు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలోని ఈ పేరా ఎన్నికలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని లోటుపాట్లను ఎత్తిచూపుతుంది. అప్పటికి ఎన్నికల కమిషన్ లేదు... మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ– నైతిక వర్తన నియమావళి) కూడా లేదు.రాజకీయ నేతలు, వ్యవస్థలన్నింటి ప్రత్యేక సమ్మతితో ఏర్పడిందీ ఎంసీసీ. మార్పులు, చేర్పులతో కాలంతోపాటు ఎదుగుతూ వచ్చింది. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎంసీసీపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. పార్టీలతో సహా నేతలు, అభ్యర్థులు... ఎన్నికల కమిషన్ కు సవాళ్లు విసురుతూనే ఉంటారు. ఇదంతా కూడా మీడియా నిఘా, న్యాయ వ్యవస్థ కీలక డేగ కన్ను మధ్యలోనే జరుగుతూంటుంది.కేరళతో మొదలు...గతాన్ని కొంచెం తరచి చూద్దాం. కేరళ అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కొన్ని విధివిధానాలతో మొదలైందీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ప్రచార సభలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, నినాదాలు, పోస్టర్లు, ప్లకార్డుల వంటివి ఎలా ఉండాలో ఈ విధి విధానాల్లో పొందుపరిచారు అప్పటి (1960) ఎన్నికల ప్రధాన అధికారి కేవీకే సుందరం. 1968లో ఎస్పీ సేన్ వర్మ ప్రధానాధికారిగా ఉండగా ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. కేరళ ఎన్నికల సందర్భంగా రూపొందించిన విధి విధానాలను అందరికీ జారీ చేస్తూ, ఎన్నికలు సజావుగా జరిగేందుకు (ఫ్రీ అండ్ ఫెయిర్) కనీస మర్యాదలను పాటించాలని కోరింది. తరువాతికాలంలో అంటే 1979 నుంచి ఈ కోడ్‌ను సార్వత్రిక ఎన్నికల సంద ర్భంగా అన్ని పార్టీలకు జారీ చేయడం ఆనవాయితీగా మార్చారు అప్పటి సీఈసీ ఎస్.ఎల్. శక్ధర్. అంతేకాకుండా, రాజకీయ పార్టీల సమ్మతితో ఈ కోడ్‌ను మరింత విశదంగా రూపొందించారు. అధికార పార్టీకి కొన్ని పరిమితులు విధించడం, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడం వంటి చర్యలు అమల్లోకి వచ్చింది అప్పుడే. 1991లో టీఎ¯Œ శేషన్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉండగా మరో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పార్టీలన్నింటి అను మతితో ‘కోడ్’ను మరింత బలపరిచారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకూ రాజకీయ వాతా వరణం మరింత పదును తేలింది. ఫలితంగా మోడల్ కోడ్ సామర్థ్యం మొద్దుబారింది. ఉల్లంఘనలు పెచ్చుమీరి పోయాయి. ఉల్లంఘనల పరిణామాలు స్పష్టం చేయాలి...ప్రస్తుతం అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఉన్న ప్రధాన లోపం కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎటువంటి పరిణామాలను ఎదు ర్కోవాల్సి వస్తుందీ? అన్నది లేకపోవడం. అందుకే ఈ కోడ్... నిబంధనల ఉల్లంఘనలకు అడ్డు కావడం లేదు. కాబట్టి వీలైనంత పార దర్శకంగా నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో స్పష్టం చేయాల్సి ఉంటుంది. విద్వేషపూరిత ప్రసంగాలు, కుల మతాలను అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడం వంటి విషయాల్లో మరీ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఓట్ల కోసం పెట్టే ప్రలోభాలు, ప్రత్యర్థి పార్టీలు, నేతల గురించి అసభ్యకరమైన సంభా షణలు, భారత సాయుధ దళాలను పొగుడుతూ లేదా విమర్శిస్తూ, చర్యలను ప్రశ్నిస్తూ చేసే ప్రసంగాల గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏ రకమైన ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలుఉంటాయో స్పష్టంగా, బహిరంగంగా ప్రకటించాలి.ఉదాహరణకు విద్వేషపూరిత ప్రసంగాల వంటి వాటికి ప్రచారంపై నిర్దిష్ట కాలం నిషేధం విధించడం, మరింత తీవ్రమైన ఉల్లంఘనలకు నిషేధ సమయాన్ని పొడిగించడం, అప్పటికీ ఉల్లంఘనలు మానకపోతే మోడల్ కోడ్ అమల్లో ఉన్నంత కాలం నిషేధాన్ని కొనసాగించడం చేయవచ్చు. ఇది కేవలం ప్రచార సభలకు మాత్రమే పరిమితం కాకుండా... మీడియాలో కనిపించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటి వాటికీ వర్తించేలా నిబంధనలు రూపొందించాలి. ‘ఉల్లంఘనులు’ స్టార్ క్యాంపెయినర్లు అయితే తరువాతి ఎన్నికల్లో ఆ గుర్తింపు రద్దు చేయడం కూడా చేయవచ్చు. అయితే వీటి నుంచి తప్పించుకునేందుకు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతారు. యుక్తులు పన్నుతారు కూడా. ఒకప్పుడు కండబలం ఉపయోగిస్తే ఇప్పుడు ఆ స్థానాన్ని ధన బలం ఆక్రమించింది. టెక్నాలజీ ఈ ఆయుధానికి మరింత పదును పెట్టింది. కోడ్‌కు కట్టుబడి ఉండటం కంటే తప్పించుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు నేతలు మరింత ఎక్కువ ఇష్టపడుతూంటారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసీసీని రీమోడల్ చేయాల్సిన అవసరముంది. అది కూడా వివక్షకు తావులేని విధంగా అమలు చేసేలా ఉండాలి. ప్రజాజీవితంలో కొద్దోగొప్పో గౌరవ మర్యాదలను కొనసాగించేందుకు ఇది చాలా ముఖ్యం. పార్టీలకు నోటీసులు... కొత్త పంథా!ఎన్నికల కమిషన్ (ఈసీ) ఈ మధ్యకాలంలో ఓ కొత్త పంథాను ఎంచుకుంది. కోడ్ ఉల్లంఘించిన వ్యక్తులకు కాకుండా... ఆ వ్యక్తుల పార్టీలకు నోటీసులు పంపుతోంది. అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలకు డ్రైవరే బాధ్యుడైనట్లు కోడ్ ఉల్లంఘనల బాధ్యత కూడా పార్టీది కాదన్నది గుర్తించాలి. పైగా ఈసీ నోటీసు ప్రాథమికంగా ఉల్లంఘనపై సంతృప్తి చెందిన తరువాతే వెళుతుందన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్లు, కీలక వ్యక్తులు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఈసీ ఆ పార్టీపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడరాదు. ఈ చర్యలు జరిమానా కావచ్చు లేదా పార్టీ గుర్తులకు సంబంధించినదైనా కావచ్చు. అవసరమైతే ఈ రెండు రకాల చర్యలు కూడా తీసుకునేలా మార్పులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా... ఉల్లంఘనలు జరిగిన 72 గంటల్లోపే చర్యలు తీసు కోవడం కూడా అవసరం. వీటికి సంబంధించి స్పష్టమైన పద్ధతి ఒకదాన్ని సిద్ధం చేయాలి. ఆలస్యంగా తీసుకునే తూతూ మంత్రపు చర్యల వల్ల ప్రజల్లో ఈసీపై నమ్మకం సడలుతుంది. కోడ్ ఉల్లంఘనలు ఎన్ని జరిగాయో ఒక జాబితా సిద్ధం చేసి వాటిల్లో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? ఎన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి? వంటి వివరాలను వెబ్సైట్లో ఉంచాలి.కోడ్ ఉల్లంఘనలను నేరుగా ఇతర చట్టాలకు అనుసంధానించడం జరిగితే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై పడుతుంది. అయితే, ఈ చర్యలన్నీ రాజ కీయ పార్టీలు కోడ్ విషయంలో స్వీయ నియంత్రణ పాటించేలా చేస్తాయా? ఇది మన రాజకీయ నేతల క్యారెక్టర్‌పై ఆధారపడిఉంటుంది. అయితే ఈ వ్యవహారాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించే వారి విచక్షణాధికారాలకు పరిమితి విధిస్తుందనడంలో సందేహం లేదు. తద్వారా ఎన్నికల ప్రధానాధికారిపై వివక్ష, ఏకపక్ష ధోరణివంటి ఆరోపణలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉల్లంఘనలపై తీసుకునే చర్యలు నిర్దిష్ట కాలావధిలోగా పూర్తవుతాయన్న భరోసా ఎన్నికల కమిషన్ ప్రజలకు కల్పించడం కూడా అవసరమే. వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. నాయకత్వం వహిస్తున్న వారు ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తే ఎలాంటి మోడల్ కోడ్లూ అవసరం ఉండదు.- వ్యాసకర్త ఎన్నికల మాజీ ప్రధాన అధికారి-అశోక్ లవాసా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement