ఈ నెల 7న వైఎస్సార్‌ఎల్పీ సమావేశం | YSRLP meeting on 7th June | Sakshi
Sakshi News home page

ఈ నెల 7న వైఎస్సార్‌ఎల్పీ సమావేశం

Jun 3 2019 6:57 AM | Updated on Mar 21 2024 8:18 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన తన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయబోతున్న నేపథ్యంలో.. ఆ తేదీకి సరిగ్గా ఒకరోజు ముందు 7న వైఎస్సార్‌ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుచేయనుండటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ రోజున ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆయన స్వయంగా ఎమ్మెల్యేలకు పార్టీకి సంబంధించి ఒక విస్పష్టమైన దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. తొమ్మిదేళ్ల చరిత్ర గలిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. పేద ప్రజల సంక్షేమం అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ఏర్పడి ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement