తండ్రి చేతిలో కొడుకు రనౌట్

వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ శివనారాయణ్‌ చందర్‌పాల్‌, అతని కొడుకు త్యాగనారాయణ్‌ చందర్‌పాల్‌ కొన్నేళ్లుగా కలిసి క్రికెట్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. కరీబియన్‌ దేశవాళీ క్రికెట్‌లో వీరిద్దరు గయానా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, తాజాగా జరుగుతున్న సూపర్‌ ఫిఫ్టీ టోర్నీలో త్యాగనారాయణ్‌ను  శివనారాయణ్‌ చందర్‌ పాల్‌ రనౌట్‌ చేయడం వార్తల్లో నిలిచింది. శివనారాయణ్‌ స్టైట్‌ డ్రైవ్‌ ఆడగా, బంతిని అడ్డుకునే ప్రయత్నంలో బౌలర్‌ కాలు అడ్డుపెట్టాడు. అతడి కాలికి తాకిన బంతి బెయిల్స్‌ను పడగొట్టింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top