మరో ప్రాణం తీసిన బాక్సిం‍గ్‌ రింగ్‌

బ్యూనోస్‌ ఎయిర్స్‌: రింగ్‌లో ప్రత్యర్ధి పిడిగుద్దులు మరో బాక్సర్‌ ప్రాణం తీశాయి.  బాక్సింగ్‌ రింగ్‌లో తీవ్రంగా గాయపడి రష్యా చెందిన బాక్సర్‌ మాక్సిమ్‌ డడ్‌షెవ్‌ మంగళవారం తుది శ్వాస విడవగా, మరొక బౌట్‌లో గాయాలు పాలైన అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు. గత శనివారం ఉరేగ్వే బాక్సర్‌ ఎడ్వర్డో అబ్రెతో  జరిగిన బౌట్‌ను డ్రా చేసుకున్న తర్వాత సాంతిల్లాన్‌ రింగ్‌లోనే  కుప్పకూలిపోయాడు. 10వ రౌండ్‌ తర్వాత మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో ఇరువురి బాక్సర్ల చేతులను పైకి ఎత్తే క్రమంలో సాంతిల్లాన్‌ నిలబడలేకపోయాడు. దాంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ చేశారు. అయితే అది విఫలం కావడంతో గుండు పోటుకు గురైన సాంతిల్లాన్‌ ప్రాణాలు విడిచాడు.  2015లో ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారిన సాంతిల్లాన్‌.. ఇప్పటివరకూ 19 విజయాలు సాధించి అరుదైన రికార్డును కల్గి ఉన్నాడు. ఈ విజయాల్లో 8 నాకౌట్‌ విజయాలు కాగా, రెండు డ్రాగా ముగిశాయి. 2016 సెప్టెంబర్‌లో దక్షిణ అమెరికా సూపర్‌ ఫెదర్‌వెయిట్‌ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో సాంతిల్లాన్‌ వెలుగులోకి వచ్చాడు.  సాంతిల్లాన్‌ మృతిపై వరల్డ్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లాటినో సిల్వర్‌ లైట్‌ వెయిట్‌ టైటిల్‌లో భాగంగా అబ్రెతో జరిగిన పోరులో 23 ఏళ్ల సాంతిల్లాన్‌ గాయాలు పాలై మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top