సంతోష్‌ దాబాలో భారీ అగ్ని ప్రమాదం

బంజారా హిల్స్‌ రోడ్డు నంబర్‌ 11లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సంతోష్‌ దాబాలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ఆ ఫ్లోర్‌లోని ఫర్నిచర్‌ తగలబడుతుంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top