ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ​దళ్‌ కార్యకర్తలు | Bajrang Dal Activist Done Marriage to The Love Couple On Valentines Day | Sakshi
Sakshi News home page

ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ​దళ్‌ కార్యకర్తలు

Feb 14 2019 2:37 PM | Updated on Mar 22 2024 11:14 AM

ప్రేమికుల రోజు జరుపుకోవడానికి వీల్లేదు... అది మన కల్చర్ కాదు... లవర్స్ డే రోజున జంటగా కనిపిస్తే పెళ్లి చేసేస్తాం... అంటూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా.. వాటిని నిజం చేసి చూపారు భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు. ఆదేశాలను లెక్క చేయకుండా జంటగా తిరుగుతున్న ఓ ప్రేమ జంటకి పెళ్లి చేసేశారు. వివరాలు.. మేడ్చల్‌లో కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కులో ఓ ప్రేమ జంట తిరుగుతుండగా వాళ్లకు బలవంతంగా పెళ్లిచేశారు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు. దాన్ని మొబైల్‌లో వీడియో తీసారు. దాంతో ఆ జంట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు మొదలుపెట్టారు. వీడియో ఆధారంగా వాళ్లను పట్టుకుంటామంటున్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement