జనసేనలో మహిళలకు రక్షణ లేదు! | Sakshi
Sakshi News home page

జనసేనలో మహిళలకు రక్షణ లేదు!

Published Sun, Dec 10 2017 3:55 PM

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అధికారిక సమావేశాలకు వెళ్లిన తాను ప్రాణాలతో బయటపడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ఓ మహిళా కార్యకర్త తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై సినీ విమర్శకుడు, నటుడు మహేశ్ కత్తి తీవ్ర స్థాయిలో స్పందిస్తూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచీ బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కల్యాణ్.. మీలాంటి సామాన్య మహిళలకు రక్షణ కల్పిస్తారని ఎలా అనుకున్నారంటూ జనసేన అధిసేన అధినేత తీరును మరోసారి తప్పుపట్టారు.

Advertisement
Advertisement