టీమిండియాతో బుధవారమిక్కడ ప్రారంభమైన తొలిటెస్టు తొలిరోజున ఇంగ్లండ్ జట్టు సత్తా చాటింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ తొలిరోజు సెంచరీతో ఆకట్టుకున్నాడు.