వినూత్న బోధన.. గణిత సాధన | - | Sakshi
Sakshi News home page

వినూత్న బోధన.. గణిత సాధన

Published Sat, Dec 2 2023 1:40 AM | Last Updated on Sat, Dec 2 2023 1:40 AM

- - Sakshi

ప్రతి విద్యార్థి ప్రతి అంశాన్ని సులభంగా నేర్చుకోవాలి. ఏ అంశమైనా సరే బోధన సరళంగా ఉంటేనే మక్కువ చూపుతారు. ఈవిషయాన్ని గమనించారు హెచ్‌ఎం నాగలక్ష్మిదేవి. వినూత్న బోధన చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను పనిచేస్తున్న పాఠశాలనే గణితాలయంగా మార్చారు. పిల్లలకు మ్యాథ్స్‌ సులభంగా అర్థమయ్యేలా చర్యలు చేపట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. త్వరలో జాతీయ స్థాయి పురస్కారం అందుకోనున్నారు.

కడప ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం మొర్రాయపల్లె ప్రాథమిక పాఠశాలలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మైనపురెడ్డి నాగలక్ష్మిదేవి నూతన బోధన పద్ధతులపై జాతీయస్థాయిలో నిర్వహించిన ఇన్నోవేటివ్‌ పెడాగోజి పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకుంది. విద్యా అమృత్‌ మహాత్సవ్‌ 2022–23లో భాగంగా విద్యా మంత్రిత్వశాఖ, కేంద్ర సీఐఈటీ, ఎన్‌సీఈఆర్‌టీ సంయుక్తంగా ఇన్నోవేటివ్‌ పెడాగోజి అంశంపై పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 5.99 లక్షల ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో 63 ప్రాజెక్టులను జాతీయస్థాయికి ఎంపిక చేశారు. వీటి నుంచి జాతీయస్థాయి జ్యూరీ టాప్‌–10 విద్యా అమృత్‌ మహాత్సవ్‌ ప్రాజెక్టులను ప్రకటించింది. వీటిలో ఆంఽధ్రప్రదేశ్‌ తరపున వైఎస్సార్‌ జిల్లా మొర్రాయిపల్లె ఎంపీపీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు మైనపురెడ్డి నాగలక్ష్మిదేవి రూపొందించిన ‘‘పర్మినెనెంట్‌ మ్యాథ్స్‌ టీఎల్‌ఎం’’ప్రాజెక్టు జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.

నాడు–నేడు పనులను...

ప్రభుత్వం చేపట్టిన నాడు– నేడు పనుల్లో భాగంగా తమ పాఠశాలలో చేపట్టిన మొదటి విడత పనులను తమ పిల్లల విద్యాభివృద్ధికి అనుగుణంగా చేయించా రు. ఇందులో భాగంగా పాఠశాల ఇనుప కటాంజనాలలో అబాకస్‌, భిన్నాలు, ఆరోహణ, ఆవరోహణ క్రమాలను అమర్చించుకుంది. ఫ్లోరింగ్‌, చెట్ల పాదులకు గణిత అకారాలను అమర్చారు. వీటిని పిల్లలు రోజు చూడటం, తాకడం ద్వారా గణతం అంటే భయం పోయి ఆసక్తి పెంచుకున్నారు. వీటిని నిత్యం చూస్తుండం ద్వారా పిల్లలకు గణితం అంటే భయం పోయి సులభంగా మ్యాథ్‌ సబ్జెక్టుపట్ల ఆసక్తిని చూపుతున్నారని హెచ్‌ఎం నాగలక్ష్మిదేవి తెలిపారు.

త్వరలో ఢిల్లీలో

అవార్డు ప్రదానం

విద్య అమృత్‌ ఫలితాల్లో ఆంధ్రప్రద్‌శ్‌ తరపున ప్రతిభచాటిన ప్రధానోపాధ్యాయురాలు మైనపురెడ్డి నాలక్ష్మిదేవికి త్వరలో ఢిల్లీఓ పురస్కారాన్ని అందించనున్నారు. విద్యా మంత్రిత్వశాఖ, సీఐఈటీ, ఎన్‌సీఈఆర్‌టీలు సంయుక్తంగా అమెను సత్కరించి అవార్డును ప్రదనం చేయనున్నారు.

విద్యార్థులకు సులభంగా మ్యాథ్స్‌ అర్థమయ్యేలా చర్యలు

జాతీయ పురస్కారానికి ఎంపికై న మెరాయిపల్లె స్కూల్‌ హెచ్‌ఎం నాగలక్ష్మిదేవి

చాలా సంతోషంగా ఉంది

జాతీయస్థాయిలో పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది. చాపాడు మండలం మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసేటప్పుడు ఇక్కడ జరిగిన నాడు– నేడు పనులను తమ పిల్లల బోధనకు అనుకూలంగా మ్యాథ్స్‌కు సంబంధించిన నమూనాలను రూపొందించాను. దీంతో పిల్లలకు మ్యాథ్స్‌ సబ్జెక్టు అంటే భయం పోయింది. నేను ఇటీవల జరిగిన బదిలీల్లో మైదుకూరు మండలం సుంకులుగారిపల్లె యూపీ స్కూల్‌కు బదిలీపై వెళ్లాను. – మైనపురెడ్డి నాగలక్ష్మిదేవి, ఉపాధ్యాయురాలు, యూపీ స్కూల్‌, సుంకులుగారిపల్లె

No comments yet. Be the first to comment!
Add a comment
1/3

2/3

3/3

Advertisement
 
Advertisement
 
Advertisement