రేపు ‘పట్టభద్రుల’ పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

రేపు ‘పట్టభద్రుల’ పోలింగ్‌

Published Sun, May 26 2024 4:15 AM

రేపు ‘పట్టభద్రుల’ పోలింగ్‌

సాక్షి, యాదాద్రి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సోమవారం జరగనుంది. అభ్యర్థుల ప్రచారం చివరి రోజైన శనివారం ముగిసింది. ఇక ఓటర్లను నేరుగా కలిసి ఓట్లు అభ్యర్థించే పనిలో పడ్డారు. గెలుపు కోసం ప్రధాన పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. ఇక ఎమ్మెల్సీ పోలింగ్‌ పూర్తయ్యే వరకు జిల్లాలోని మద్యం దుకాణాలు మూసి వేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ హనుమంతు కే. జెండగే ఆదేశాలు జారీ చేశారు.

సాయంత్రం 4 గంటల వరకు సాగిన ప్రచారం

ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 4 గంటల వరకు సాగింది. అభ్యర్థుల తరపున ఆయా పార్టీల నేతలు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థ్ధి తరపున ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, భువనగిరి, మునుగోడు ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మిగతా కాంగ్రెస్‌ నాయకులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. టీపీసీసీ అఽధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి భువనగిరిలో ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరపున మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్‌, బూడిద భిక్షమయ్యగౌడ్‌, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రచారం చేశారు. బీజేపీ తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు పాశఽం భాస్కర్‌తోపాటు జిల్లాలోని నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు ప్రచారం చేశారు.

సోషల్‌ మీడియాలో ప్రచార జోరు..

ప్రఽస్తుత ఎన్నికల్లో బహిరంగ ప్రచారం, ఓటర్లను కలవడంతో పాటు సోషల్‌ మీడియాను మునుపెన్నడూ లేనివిధంగా వాడేశారు. అభ్యర్థులు తమ మెసేజ్‌ల ద్వారా ఓటు అభ్యర్థించారు. గడువు ముగిసే వరకు ఆయా పార్టీల నాయకులు వాట్సాప్‌ మెసేజ్‌, ఫోన్‌ కాల్స్‌తో ఓటు వేయాలని కోరారు.

ప్రలోభాల ఎర

ఎమ్మెల్సీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థుల తరుపున ఓటర్లకు ప్రలోభాల ఎర వేస్తున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్లను కలిసి డబ్బులు పంచే కార్యక్రమానికి తెర లేపారు. సంస్థలు, వ్యక్తిగతంగా సమూహాలుగా గుర్తించి ఓటుకు నోటు పంపిణీ చేపడుతున్నట్లు తెలిసింది. ఓ ప్రధాన పార్టీ ఓటుకు రూ.2 వేలు ఇచ్చేందుకు ప్లాన్‌ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మిగతా ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బుల పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పోల్‌ చిటీలు ఇచ్చే క్రమంలోనే ఓటుకు నోటు ఇవ్వాలని నిర్ణయించారు.

ఫ ముగిసిన ప్రచారం

ఫ ఓటర్లను ప్రసన్నం చేసుకునే

పనిలో అభ్యర్థులు

ఎన్నికల నిబంధనలు పాటించాలి

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ పోలింగ్‌ ముగిసే సమయమైన 27వ తేదీ సాయంత్రం 4 గంటలను ఆధారంగా చేసుకుని 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జండగే శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లను ఆకర్షించడం వంటివి చేయకూడదని, ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement