పాలిసెట్‌కు 1,373 మంది హాజరు | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌కు 1,373 మంది హాజరు

Published Sat, May 25 2024 2:45 PM

పాలిస

భువనగిరి : జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పాలిసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణకు ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరిగింది. 1,496 మంది విద్యార్థులకు 1,373 మంది హాజరయ్యారు. 123 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 91.78 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు పాలిసెట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ షాఫిజ్‌ అక్తర్‌ తెలిపారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

భువనగిరి : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1.272 మంది విద్యార్థులకు గాను 1,172 మంది హాజరయ్యారు. 99 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన సెకండియర్‌ పరీక్షకు 542 మందికి 506 మంది విద్యార్థులు హాజరయ్యారు. 36 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు.

హెడ్‌ కానిస్టేబుల్‌కు బంగారు పతకాలు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బాంబ్‌స్వ్కాడ్‌ టీంలో పని చేస్తున్న కానిస్టెబుల్‌ అంబోజు అనిల్‌కుమార్‌ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 22 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి పాన్‌ ఇండియా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ చాంయన్‌షిప్‌ పోటీల్లో 400, 800, 3,000 మీటర్ల పరుగు పందెంలో అనిల్‌కుమార్‌ మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే అంతర్జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై నట్లు అనిల్‌కుమార్‌ తెలిపారు.

ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం

బీబీనగర్‌ : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం బీబీనగర్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ వల్ల కొనుగోళ్లు కాస్త ఆలస్యం అయ్యాయని, వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎప్పటికపుడు అధికారులు, మిల్లర్లతో మాట్లాడుతూ కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.వ్యవసాయం గురించి తెలియని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రైతుల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు పంజాల రామాంజనేయులుగౌడ్‌, గోలి పింగళ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, పొట్టోల శ్యామ్‌గౌడ్‌, ఎంపీటీసీ గోలి నరేందర్‌రెడ్డి, గడ్డం బాలకృష్ణ, పంజాల పెంటయ్య, మల గారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పాలిసెట్‌కు 1,373 మంది హాజరు
1/2

పాలిసెట్‌కు 1,373 మంది హాజరు

పాలిసెట్‌కు 1,373 మంది హాజరు
2/2

పాలిసెట్‌కు 1,373 మంది హాజరు

Advertisement
 
Advertisement
 
Advertisement