మల్లన్న గెలుపులో యువజన కాంగ్రెస్‌ పాత్ర కీలకం | Sakshi
Sakshi News home page

మల్లన్న గెలుపులో యువజన కాంగ్రెస్‌ పాత్ర కీలకం

Published Sat, May 25 2024 2:40 PM

మల్లన్న గెలుపులో యువజన కాంగ్రెస్‌ పాత్ర కీలకం

నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గెలుపులో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని స్పోర్ట్స్‌ అథారిటీ రాష్ట్ర చైర్మన్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శివసేనారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్‌ పోస్టులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మాట్లాడుతూ తీన్మార్‌ మల్లన్న గెలిస్తే ఆ క్రెడిట్‌ యువజన కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గౌని రాజారమేష్‌యాదవ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌సింగ్‌ నాయక్‌, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా రాకేష్‌, ఎండీ గౌస్‌, జిల్లా ఉపాధ్యక్షుడు జయంత్‌రెడ్డి, నల్లగొండ, సాగర్‌ మిర్యాలగూడ ,దేవరకొండ , నకిరేకల్‌ నియోజకవర్గాల అధ్యక్షులు జహంగీర్‌బాబా, పగడాల నాగరాజు, ఆజర్‌, హరికృష్ణ, జలంధర్‌రెడ్డి, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, మండల అధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, కనగల్‌ అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.

ఫ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement