ఫ్లోరోసిస్‌ బాధితురాలి కోరిక నెరవేర్చిన ఐఏఎస్‌ | Sakshi
Sakshi News home page

ఫ్లోరోసిస్‌ బాధితురాలి కోరిక నెరవేర్చిన ఐఏఎస్‌

Published Sat, May 25 2024 2:40 PM

ఫ్లోరోసిస్‌ బాధితురాలి కోరిక నెరవేర్చిన ఐఏఎస్‌

కోదాడరూరల్‌ : ఫ్లోరోసిస్‌ బాధితురాలు సువర్ణ గీసిన బొమ్మ తనకు చేరాలని చివరి కోరికను నెరవేర్చారు ఐఏఎస్‌ అధికారి స్మితాసబర్వాల్‌. మర్రిగూడ మండలంసాయిబండతండాకు చెందిన సువర్ణ.. ఇందిరాగాంధీ, ప్రధాని మోదీ, కేసీఆర్‌, రాహుల్‌గాంధీ, ఆనంద్‌మహింద్రా వంటి అనేక మంది ప్రముఖుల చిత్రాలను గీసింది. ఆమె ప్రతిభను చూసి ఎన్‌ఆర్‌ఐ సుధీర్‌ ఆమెకు శిక్షణ ఇప్పించాడు. వాటిని వేలం వేయగా రూ.5లక్షల బహుమతులు కూడా వచ్చాయి. అయితే సువర్ణ గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె గీసిన స్మితాసబర్వాల్‌, పీవీ సింధు చిత్రాలను వారికి అందజేయాలని చనిపోయే ముందు చెప్పింది. ఆ విషయాన్ని జలగం సుధీర్‌ ట్వీట్‌ చేయగా స్పందించిన స్మితాసబర్వాల్‌ కోదాడలో ఉన్న చిత్రపటాన్ని తెప్పించుకొని తన కార్యాలయంలో పెట్టుకుందని సుధీర్‌ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న పటిక, బెల్లం పట్టివేత

కోదాడరూరల్‌ : ఏపీ నుంచి అక్రమంగా తెలంగాణలోకి తరలిస్తున్న నల్లబెల్లంతోపాటు పటికను కోదాడ ఎకై ్సజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎకై ్సజ్‌ సీఐ శివశంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ నుంచి తెలంగాణలోకి నిషేధిత నల్లబెల్లం, పటికను రాష్ట్రంలోకి కోదాడ మీదుగా వస్తుందనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం క్రాస్‌రోడ్‌లో శుక్రవారం ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నుంచి ఖమ్మం వైపు ఇద్దరు వ్యక్తులతో వస్తున్న బొలేరోను ఆపి తనిఖీ చేయగా అందులో 100 కేజీల నల్లబెల్లం, 600 కేజీల పటిక పట్టుబడినట్లు తెలిపారు. అదేవిధంగా అనంతగిరి మండలంలోని చనుపల్లి వద్ద ద్విచక్రవాహనంపై సారా తరలిస్తున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన బెల్లం, పటిక, బొలేరో, ద్విచక్రవాహనాన్ని సీజ్‌ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement