అన్నదాతల ఆశలు నేలపాలు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఆశలు నేలపాలు

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

భూదాన్‌పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలో నేలకొరిగిన వరి పొలాలు - Sakshi

భూదాన్‌పోచంపల్లి, రాజాపేట : పంట చేతికొచ్చే సమయంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులతో పంటలకు నష్టం వాటిల్లింది. ఆస్తినష్టం జరిగింది. భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో వల్లూరి రాములుకు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. అలాగే వాటర్‌ఫిల్టర్‌ వద్ద ఉన్న వేపచెట్టు విరిగి ఇంటిపై పడడంతో పాక్షికంగా దెబ్బతింది. అలాగే పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి కరెంట్‌ తీగలపై పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కౌలురైతు వస్పరి శంకరయ్యకు చెందిన రెండు ఎకరాల వరిచేను నేలకొరిగింది. అంతమ్మగూడెం, దోతిగూడెం, భీమనపల్లి, కనుముకుల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోఽ ధాన్యం కుప్పలపై కప్పిన పట్టాలు లేచిపోయాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అరగంట పాటు వర్షం కురిసింది.

రాజాపేట మండలంలో..

రాజాపేట మండలంలోని సింగారం, కుర్రారం, జాల, కొత్త జాల, పాముకుంట తదితర గ్రామాల్లో చేతికొచ్చిన మామిడి కాయ నేలరాలింది. సుమారు 20 ఎకరాల్లో మామిడికి నష్టం వాటిల్లింది. జాల గ్రామంలో బర్మ రామచంద్రం పశువు కొట్టం కూలిపోయింది. మొగిలి వెంకటయ్య తదితర రైతుల వరి పొలాలు ఒరిగి ధాన్యం నేలరాలింది. దెబ్బతిన్న పంటలను, పశువుల కొట్టాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పరిశీలించారు. బాధిత రైతులకు వరికి ఎకరానికి రూ.20వేలు, పండ్ల తోటలకు రూ.50 వేలు నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, జెడ్పీటీసీ గోపాల్‌ గౌడ్‌, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ గొల్లపల్లి రాంరెడ్డి, బీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, నాయకులు భాస్కర్‌గౌడ్‌, గుంటి మధుసూదన్‌రెడ్డి, సంతోష్‌ గౌడ్‌, రాములు నాయక్‌ పాల్గొన్నారు.

ఫ భూదాన్‌పోచంపల్లి, రాజాపేట మండలాల్లో ఈదురుగాలుల బీభత్సం

ఫ వరి, మామిడి తోటలకు నష్టం

ఫ ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పు రేకులు

No comments yet. Be the first to comment!
Add a comment
ఈదురుగాలులకు భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో ఎగిరిపడిన ఇంటి రేకులు
1
1/2

ఈదురుగాలులకు భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో ఎగిరిపడిన ఇంటి రేకులు

రాజాపేట మండలం జాల గ్రామంలో బాధితులతో మాట్లాడుతున్న గొంగిడి సునీత
2
2/2

రాజాపేట మండలం జాల గ్రామంలో బాధితులతో మాట్లాడుతున్న గొంగిడి సునీత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement