ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌ తీగ చోరీ | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌ తీగ చోరీ

Published Sun, May 26 2024 7:25 AM

ట్రాన

నల్లబెల్లి: ముచ్చింపుల శివారులోని 25 కేవీ డీటీఆర్‌ ట్రాన్‌ఫార్మర్‌లోని కాపర్‌ తీగను దొంగలు చోరీ చేశారు. ఎస్సై రామారావు కథనం ప్రకారం.. ముచ్చింపుల శివారులోని మంచినీటి బావికి 25 కేవీ డీటీఆర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను అధికారులు ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేసి 38 కిలోల కాపర్‌ తీగను చోరీచేసి, 63 లీటర్ల ఆయిల్‌ను పారబోశారు. సుమారు రూ.43 వేల నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ ఏఈ రవళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

పద్మ అవార్డులకు

దరఖాస్తుల ఆహ్వానం

కాశిబుగ్గ: కేంద్రం ప్రభుత్వం ప్రదానం చేసే పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్‌ఓ సత్యవాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, ఆటలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపారం తదితర రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారు padmaawards. gov.in వెబ్‌సైట్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు సేవలకు సంబంధించిన పేపర్‌ కటింగ్స్‌, ఫొటోలతో కూడిన మూడు సెట్లను జూన్‌ 15లోపు ఓ సిటీలోని జిల్లా యువజన క్రీడల కార్యాలయంలో అందజేయాలని ఆమె కోరారు. జూన్‌ 15 తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరిస్తారని డీవైఎస్‌ఓ తెలిపారు.

వరంగల్‌ ఫోర్ట్‌ ఇన్‌చార్జ్‌

సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ ఫోర్ట్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ శనివారం రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ డీఐజీ సుభాషిణి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారనే ఆరోపణల్ని విచారించి సెస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్తీక్‌ సెలవుల్లో ఉండడంతో డీఐజీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్‌ను ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా అధికారులు నియమించారు.

లింగనిర్ధారణ

పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

డీఎంహెచ్‌ఓ వెంకటరమణ

గీసుకొండ: లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.వెంకటరమణ హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం జరిగిన పీసీపీఎన్డీ టీ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కానింగ్‌ సెంటర్లు, ఆస్పత్రుల యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, తల్లి, కడుపులోని బిడ్డ క్షేమంగా ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి గర్భస్థ పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు మండల పరశురాములు మాట్లాడుతూ సమాజంలో సీ్త్ర, పురులు సమానంగా ఉన్నప్పుడే అసమానతలు ఉండవన్నారు. పలు శాఖల సమన్వయంతో ఆడ శిశువులను రక్షించాలని కోరారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ పద్మశ్రీ, డాక్టర్‌ ఆచార్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్‌, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్‌, ఎస్‌ఓ విజయలక్ష్మి, నాగరాజు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌పై వ్యతిరేక పోస్టులు

పెట్టిన ఒకరిపై కేసు

చెన్నారావుపేట: వాట్సాప్‌ గ్రూపుల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు ఒకరిపై కేసు నమోదు చేసినట్లు చెన్నారావుపేట ఎస్సై గూడ అరుణ్‌కుమార్‌ శనివారం తెలిపా రు. చెన్నారావుపేట గ్రామ శివారు ఈర్యతండాకు చెందిన ధరంసోతు సుమన్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు చేశాడని ఆ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా గోపాల్‌నాయక్‌ ఫిర్యాదు చేశారు. ఈమేరకు సుమన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. వాట్సా ప్‌ గ్రూపుల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ లకు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ట్రాన్స్‌ఫార్మర్‌లో  కాపర్‌ తీగ చోరీ
1/1

ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌ తీగ చోరీ

Advertisement
 
Advertisement
 
Advertisement