కేవీకే శాస్త్రవేత్తల సూచనలు.. | Sakshi
Sakshi News home page

కేవీకే శాస్త్రవేత్తల సూచనలు..

Published Fri, May 24 2024 7:20 AM

-

పాలెం అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో రైతులకు అవసరమైన వరి, వేరుశనగ, జొన్న, కంది, మినుము, పెసర తదితర విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. అందుకోసం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటుచేయనున్నారు. కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ఆధునిక వంగడాలు, సాగులో మెళకువలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇటీవల కాలంలో పంటలను పట్టిపీడిస్తున్న చీడపీడలు, ఎరువుల వాడకం, సేంద్రియ సాగుపై సూచనలు అందిస్తారు. పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం, కృషి విజ్ఙాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచారు. 94904 09163, 63008 20238 నంబర్లను సంప్రదించి విత్తనాలు పొందవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement