జనరల్ స్థానమైన మహబూబ్‌నగర్‌తో పాటు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో సైలెంట్ ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నుంచి 31 మంది, నాగర్‌కర్నూల్‌లో 19 మంది బరిలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్యే పోరు కొనసాగింది. ఉదయం మందకొడిగా.. తొమ్మిది తర్వాత కొంత పుంజుకోవడం.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తగ్గడం.. చివరి రెండు గంటల్లో అధిక సంఖ్యలో ఓటర్లు బారులుదీరిన క్రమంలో సైలెంట్ ఓటింగ్ కొనసాగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో క్రాస్‌ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీల అభ్యర్థుల మధ్యే పోరు కొనసాగింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ పార్టీకి చెందిన ఓట్లు వేరే పార్టీ అభ్యర్థికి క్రాస్ అయినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం చోటుచేసుకున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment