Sakshi News home page

భక్తిశ్రద్ధ్దలతో రంజాన్‌

Published Fri, Apr 12 2024 1:00 AM

వనపర్తిలోని ఈద్గా వద్ద ముస్లింల ప్రార్థనలు  
 - Sakshi

వనపర్తి టౌన్‌: భగవంతుడు ఒక్కడేనని విశ్వసిస్తూ.. దైవ ప్రార్థనలు, ఉపవాసాలు, దానధర్మాలు, మక్కా యాత్ర పంచసూత్రలపై ఆధారపడి ఉండటమే రంజాన్‌ మాసం ప్రత్యేకతని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి నెలవంక కనిపించడంతో గురువారం ముస్లింలు రంజాన్‌ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాకేంద్రంలోని గోపాల్‌పేట రోడ్డులో ఉన్న ఈద్గాకు వేలాదిగా చేరుకున్న ముస్లింలు సామూహిక ప్రార్థనలు.. సమీప మసీద్‌లలోనూ ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద వారికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పుట్టగ మహేష్‌, వైస్‌ చైర్మన్‌ పాకనాటి కృష్ణ, కాంగ్రెస్‌పార్టీ మెడికల్‌ విభాగం రాష్ట్ర సమన్వయకర్త ఆదిత్యారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, సతీష్‌, చీర్ల విజయ్‌చందర్‌, బి.కృష్ణ, పరశురాం, కిరణ్‌కుమార్‌, బీజేపీ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, బి.రాము తదితరులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తన నివాసంలో అక్కడికి వచ్చిన ముస్లింలను ఆలింగనం చేసుకొని రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పారు.

పోలీసు బందోబస్తు..

రంజాన్‌ సందర్భంగా జిల్లాకేంద్రంతో పాటు మండలాల్లోని మసీద్‌లు, ఈద్గాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు పలు మసీద్‌ల వద్ద పోలీసు పహారా కొనసాగింది.

ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు

పండుగ శుభాకాంక్షలు తెలిపిన

ప్రముఖులు

Advertisement
Advertisement