Sakshi News home page

విమర్శలు, సెంటిమెంట్‌ అస్త్రంగా..

Published Fri, Apr 12 2024 1:00 AM

-

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిలో ఉన్న డీకే అరుణ.. ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీ మేరకు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా తేలేకపోయారు..? అచ్చంపేట– తాండూరు, కృష్ణా– వికారాబాద్‌ రైల్వేలేన్‌ పెండింగ్‌, నారాయణపేటకు మంజూరైన సైనిక్‌ స్కూల్‌ను వేరే ప్రాంతానికి తరలించడంపై బీజేపీ నాయకులు ఏం చేశారు అంటూ పలు అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కొడంగల్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతోపాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ప్రాంతంలోని బీడు భూములను నీళ్లతో తడిపేందుకు రూ.4 వేల కోట్లతో కొడంగల్‌– నారాయణపేట పథకాన్ని మంజూరు చేశామని.. ఇదంతా మీ ప్రాంతానికి చెందిన బిడ్డ సీఎంగా ఉన్నందుకేనంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవలంభించిన తరహాలో సెంటిమెంట్‌ రగిల్చేలా రేవంత్‌ ప్రసంగించారు.

Advertisement
Advertisement