ప్రశ్నించడం ప్రాణపదం కావాలి

పుస్తకావిష్కరణ చేస్తున్న విద్యావంతులు  - Sakshi

వనపర్తిటౌన్‌: ప్రశ్నించడం మానుకుంటే ప్రజా ఆమోదం లేని నిర్ణయాలను ఆమోదించినట్లు అవుతుందని ప్రజా సంఘాల సమావేశ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ మురళీధర్‌ అన్నారు. సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు, విద్యావంతులు ప్రత్యక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందారెడ్డి రచించిన ‘భారత ప్రజలమైన మేము ఈ దేశానికి యజమానులము’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు డా.మురళీధర్‌ మాట్లాడారు. ప్రజల పక్షాన వినిపించాల్సిన వాదనలు వినిపించకుండా మౌనంగా ఉంటే సమాజానికి హాని చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఆదర్శ కులాంతర వివాహాలు 30, 50 ఏళ్ల కిందట జరిగినప్పుడు భవిష్యత్‌లో కుల వ్యవస్థ నిర్మూలన జరుగుతుందని భావిస్తే, అందుకు విరుద్ధంగా సమాజం పురోగమించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. కులం, మతం పేరుతో చేస్తున్న మూర్ఖత్వ వాదనలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యువతరంలో సైన్స్‌ భావాలను పెంపొందించడంతో పాటుగా రాజకీయ అంశాలపై పరిజ్ఞానం పెంపొందించేలా ముందుకు సాగాలన్నారు. యువతరంలో చైతన్యం తీసుకొచ్చేందుకు విద్యా విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యావిధానంలో శాసీ్త్రయ దృక్పథం పెంపొందితేనే యువతరంలో చైతన్యం పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం జన విజ్ఞాన వేదికకు వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో కవి జనజ్వాల, ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీడీఓ అప్జల్‌, అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ లీడర్‌ శశిభూషణ్‌, జేఏసీ చైర్మన్‌ వేణుగోపాల్‌, కన్వీనర్‌ రాజారామ్‌ప్రకాశ్‌, డీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ యోసేపు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఫ కుల, మత వ్యవస్థ

రుగ్మతలను అరికట్టాలి

ఫ విద్యావంతుల

సదస్సులో ప్రముఖులు

ఫ ‘భారతదేశ ప్రజలమైన మేము ఈ దేశానికి యజమానులం’పుస్తకావిష్కరణ

Read latest Wanaparthy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top