ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల

Published Sun, May 26 2024 4:40 AM

ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల

ఏయూక్యాంపస్‌ : ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్‌ ఆచార్య డి.వి.ఆర్‌.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. డిగ్రీ ఆరో సెమిస్టర్‌లో మొత్తం 27,603 మంది పరీక్షకు హాజరవగా 27,483 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 99.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బి.ఎ(సీబీసీఎస్‌)లో 99.68, బీబీఏ(సీబీసీఎస్‌)లో 98.66,బీకాం(కంప్యూటర్స్‌)లో 99.71, బీకాం(జనరల్‌)లో 99.92, బీహెచ్‌ఎంిసీటీలో 100, బీఎస్సీలో 99.52, బీఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీలో 90, బీఎస్సీ ఫుడ్‌ సైన్స్‌లో 100, బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీలో 100, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఓకేషనల్‌లో 100 మంది ఉత్తీర్ణత సాధించారు.

గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

కంచరపాలెం: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్‌, 5వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా సమన్వయాధికారి ఎస్‌.రూపవతి తెలిపారు. విశాఖ జిల్లా పరిధిలో 3, అనకాపల్లి జిల్లా పరిధిలో 8 గురుకులాల్లో మిగుల సీట్లు భర్తీ చేస్తామన్నారు. 5వ తరగతిలో బాలుర అడ్మిషన్‌ కోసం 28వ తేదీ కంచరపాలెంలోని జిల్లా సమన్వయాధికారి కార్యాలయంలో, బాలికల అడ్మిషన్‌ కోసం 29వ తేదీ తాళ్లపాలెం అంబేడ్కర్‌ గురుకులంలో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. 4వ తరగతి స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఆమె కోరారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో బాలుర అడ్మిషన్‌ కోసం 30వ తేదీ సబ్బవరం గురుకులంలో, బాలికలకు 31న మేహాద్రి గెడ్డ గురుకులంలో కౌన్సెలింగ్‌ ఉంటుందని, తగిన ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement