కొనసాగుతున్న టీడీపీ ప్రలోభాల పర్వం | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న టీడీపీ ప్రలోభాల పర్వం

Published Fri, May 10 2024 6:05 PM

కొనసాగుతున్న టీడీపీ ప్రలోభాల పర్వం

మధురవాడ: భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 5, 7 వార్డుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేశారు. ప్రియదర్శిని కాలనీ దోభీ ఖానా వద్ద ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో 7వ వార్డుకు చెందిన టీడీపీ ముఖ్యనేతతో పాటు 5వ వార్డు ముఖ్యనాయకులు, గంటా నియమించిన పర్యవేక్షకుల ఆధ్వర్యంలో డబ్బులు పంపిణీ చేశారు. వాటర్‌ ట్యాంక్‌, స్వతంత్రనగర్‌ పార్కు సమీపంలోని సచివాలయం ఎదురు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు స్లిప్పులు తనిఖీలు చేసి మరీ డబ్బులు పంపిణీ చేశారు. పట్ట పగలు అడ్డూ.. ఆపూ లేకుండా టీడీపీ నాయకులు డబ్బులు పంపిణీ చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇంత జరగుతున్నా ఎన్నికలు అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ

Advertisement
 
Advertisement
 
Advertisement