డ్వాక్రా గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులకు గిన్నెలు | Sakshi
Sakshi News home page

డ్వాక్రా గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులకు గిన్నెలు

Published Thu, May 9 2024 5:35 AM

డ్వాక

● పశ్చిమలో అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ ● యథేచ్ఛగా డబ్బులు, వెండి సామగ్రి పంపకం

గోపాలపట్నం: ఓటమి భయంతో విశాఖ పశ్చిమంలో టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు తెరలేపారు. గతంలో ఆర్పీలకు బంగారు ఆభరణాలు ఇవ్వగా.. ఇప్పుడు డ్వాక్రా గ్రూపు అధ్యక్ష కార్యదర్శులకు వెండి గిన్నెలు అందిస్తున్నారు. అక్కడితో ఆగకుండా డ్వాక్రా గ్రూపు మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. వారికి భోజనాలు పెడుతున్నారు. డ్వాక్రా పుస్తకాల మొదటి పేజీ జిరాక్స్‌ ఇస్తే డబ్బులు ఇస్తామంటూ ప్రలోభ పెడుతున్నారు. ప్రతీ వార్డులో స్థానిక నాయకులతో వీటిని సేకరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు డాక్‌ స్వచ్ఛంద సంస్థ కూడా సహకరిస్తుందని తెలుస్తోంది. గ్రూపుల్లో మహిళల వివరాలు, వారికి ఎక్కడ ఓటు ఉంది, వారు ఏఏ పార్టీకి చెందిన వారు తదితర వివరాలు ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ నాయకుల తాయిలాలను వ్యతిరేకిస్తున్న వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. కాగా.. పశ్చిమ టీడీపీ నాయకులపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. ఎన్నికల అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓటర్లకు గడియారాల పంపిణీ

కంచరపాలెం: జీవీఎంసీ 57వ వార్డు ఊర్వశి కూడలి, ఐటీటీ జంక్షన్‌, మర్రిపాలెం ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభపెడుతూ టీడీపీ నాయకులు గడియారాలను పంచిపెట్టారు. చంద్రబాబు, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు చిత్రపటాలతో సిద్ధం చేసిన గడియారాలను ఆ పార్టీ వార్డు అధ్యక్షుడు పెంటకోట అజయ్‌బాబు ఓటర్లకు తాయిలాలుగా అందించారు. తమ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయాలని గడియారాలను అందిస్తూ దర్జాగా ప్రచారం చేస్తున్నా.. ఎన్నికల పర్యవేక్షణ అధికారులు ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

డ్వాక్రా గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులకు గిన్నెలు
1/1

డ్వాక్రా గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులకు గిన్నెలు

Advertisement
 
Advertisement
 
Advertisement