రోడ్లు @ రూ 22.34 కోట్లు | Sakshi
Sakshi News home page

రోడ్లు @ రూ 22.34 కోట్లు

Published Thu, May 9 2024 5:30 AM

రోడ్లు @ రూ 22.34 కోట్లు

నియోజకవర్గంలో రూ.22.34 కోట్లతో వార్డుల్లో ప్రధాన రహదారులతో పాటు వీధి రోడ్లు నిర్మించారు. రూ 2.35కోట్లతో చినగదిలి కూడలి నుంచి సూర్యతేజానగర్‌ వరకు అర కిలోమీటర్‌ పొడవున 20 అడుగుల వెడల్పు రోడ్డును 60 నుంచి 80 అడుగుల రోడ్డుగా విస్తరించారు.

● రూ.1.99కోట్లతో హనుమంతవాక, కై లాసగిరి కూడలి వరకు రోడ్డు విస్తరించారు. సుమారు 1,200 మీటర్ల పొడవున్న ఈ రోడ్డును అవరమైనచోట్ల విస్తరించి.. ఇరుపక్కలా కాలువలు, పాత్‌వేలు నిర్మాణం చేపట్టారు.

● రూ.4 కోట్ల జీవీఎంసీ నిధులతో సీతకొండ వద్ద బీచ్‌రోడ్డును విస్తరించారు. సీతకొండ మలుపు వద్ద వైఎస్సార్‌ సీ వ్యూ పాయింట్‌ నుంచి సీతకొండ చివర వరకు సుమారు 400 మీటర్ల పొడవున 30 అడుగుల రోడ్డును 80 అడుగులకు విస్తరించారు.

● రూ.6 కోట్ల వీఎంఆర్డీఏ నిధులతో జాతీయరహదారిపై విశాఖవేలీ స్కూల్‌ కూడలి నుంచి సీతకొండ చివర బీచ్‌రోడ్డు వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున డబుల్‌ రోడ్డు నిర్మించారు.

● రూ.7కోట్లతో పెదగదిలి నుంచి అంబేడ్కర్‌ కూడలి, అంబేడ్కర్‌ కూడలి నుంచి సూర్యతేజానగర్‌ వరకు డబుల్‌ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, కాలువల పనులు ప్రారంభించారు.

● అన్ని వార్డుల్లోని వీధుల్లో మరో రూ.3 కోట్లతో సీసీ, బీటీ రోడ్లు నిర్మించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement