Sakshi News home page

గిరిజన బాలికకు అరుదైన శస్త్ర చికిత్స

Published Thu, Apr 18 2024 9:30 AM

బాలికకు శస్త్ర చికిత్స చేస్తున్న వైద్యులు  - Sakshi

మహారాణిపేట: కేజీహెచ్‌లో పేద గిరిజన రోగికి మొదటిసారిగా అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 15 ఏళ్ల బాలికకు పుట్టుకతో వచ్చిన వెన్నెముక వైకల్యాన్ని కేజీహెచ్‌ ఆర్థ్ధోపెడిక్‌ వైద్యుడు, ప్రొఫెసర్‌ లాడి లోకనాథం ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స నిర్వహించి సరిచేశారు. ఐదు గంటల పాటు శ్రమించి బాలిక వెన్నుముకకు టైటానియంహార్డ్‌వేర్‌తో శస్త్ర చికిత్స ద్వారా సరిదిద్దారు. అనంతరం మూడు రోజుల పాటు ఇంటెన్సివ్‌కేర్‌ ఉంచి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆమెకు కుట్లు కూడా తొలగించారు. ఇప్పుడు ఎవరి సహాయం లేకుండా బాలిక నడుస్తోందని ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, కేజీహెచ్‌ మూడో యూనిట్‌ ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్‌ లోకనాథం వివరించారు. పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో బుధవారం డిశ్చార్జ్‌ చేశామన్నారు. పాడేరుకు చెందిన 15 ఏళ్ల మాధవి ఫిబ్రవరి 19న వెన్నుముక నొప్పితో డాక్టర్‌ లోకనాథాన్ని సంప్రదించారు. బాలికకు పుట్టుకతో పార్శ్వగూని అంగవైక్యంతో బాధపడుతోంది. వివిధ పరీక్షలు నిర్వహించి, మార్చి 19వ తేదీన కేజీహెచ్‌లో శస్త్ర చికిత్స నిర్వహించారు. వైద్యులు లోకనాథం, అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స విజయవంతమైంది. బాలికకు అసవరమయ్యే వైద్య పరికరాల కోసం రూ.1.50లక్షలను లోక్‌నాథం తనకున్న పరియాలు ద్వారా సమకూర్చారు. తనకు పూర్తి సహాకారం అందించిన కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌ కుమార్‌, ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజులకు డాక్టర్‌ లోకనాథం కృతజ్ఞతలు తెలిపారు.

వెన్నుముక అంగవైకల్యాన్ని సరిచేసిన ఆర్థోపెడిక్‌ వైద్యుడు

నిధులు సేకరించి శస్త్ర చికిత్స చేసిన లోక్‌నాథం

Advertisement

తప్పక చదవండి

Advertisement