‘ఆదర్శం’గా పూర్తి చేయండి | Sakshi
Sakshi News home page

‘ఆదర్శం’గా పూర్తి చేయండి

Published Fri, May 24 2024 1:15 PM

‘ఆదర్శం’గా పూర్తి చేయండి

కడ్తాల్‌: ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా ఎంపికై న మండల పరిధిలోని వాస్‌దేవ్‌పూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఆమె సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంజనీరింగ్‌ బృందం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్‌, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. పనులు వేగవంత చేసి సకాలంలో పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షి ంచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్‌, ఏఈ పరమేశ్‌, ఎంఈవో సర్ధార్‌నాయక్‌, నోడల్‌ అధికారి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

గడువులోపు పూర్తి కావాలి

మాడ్గుల: అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని గిరికొత్తపల్లి పాఠశాలను గురువారం ఆమె పరిశీలించారు. విద్యుత్‌, వైరింగ్‌, నల్లాల ఏర్పాటు పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మండల విద్యాధికారి సర్ధార్‌ నాయక్‌, ఎంపీఓ సూర్యవంశీ, ఎంపీడీవో సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

ఎంపికై న అమ్మ ఆదర్శ పాఠశాలలపరిశీలన

Advertisement
 
Advertisement
 
Advertisement