ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

Published Tue, May 14 2024 11:40 AM

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

చంద్రగిరి: ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును సోమవారం పలువురు ప్రముఖులు వినియోగించుకున్నారు. ఇందులో ఎంబీయూ యూనివర్సిటీ చాన్సలర్‌, సినీ నటుడు డాక్టర్‌ మంచు మోహన్‌బాబు, సీఈఓ, నటుడు మంచు విష్ణు ఉన్నారు. ఉదయం తమ ఓటు హక్కును ఏ.రంగంపేటలో వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వారు ప్రజలకు సూచించారు.

35 ఏళ్ల తర్వాత పోలింగ్‌ కేంద్రంలోకి ఏజెంట్లు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పోలింగ్‌ కేంద్రంలో 35 ఏళ్ల తర్వాత ఏజెంట్ల సమక్షంలో ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగిన ఘటన మండలంలోని భీముని చెరువులో చోటు చేసుకుంది. వివరాలు.. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం స్వగ్రామం భీమునిచెరువులో వార్డు స్థాయి నుంచి ఏ ఎన్నికలు జరిగినా ఏ ఇతర రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉండరు. సోమవారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లు పోలీసుల సాయంతో పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును ఆదిమూలం వినియోగించుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను చూసి రగిలిపోయారు. తన తనయుడు, జెడ్పీటీసీ సభ్యుడు సుమన్‌కుమార్‌ గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడైన భీమునిచెరువు సర్పంచ్‌ మురుగేశంపై విరుచుకుపడ్డాడు. సొంత ఊర్లోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లను కేంద్రంలోకి ఎలా పంపుతారని దుర్భాషలాడాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement